October 2: సత్యమేవ జయతే.. ఒకే రోజు రెండు పర్వదినాలు.. వాటి సారం ఒక్కటే
ABN , Publish Date - Oct 02 , 2025 | 08:47 AM
చెడుపై మంచి గెలిచిన రోజు(దసరా పండుగ).. అంతర్జాతీయ అహింసా దినం(మహాత్ముడి జయంతి).. రెండూ ఈ ఏడాది ఒకేరోజు రావడం కాకతాళీయమే. అయితే ఆ పర్వదినాల పరమార్థం ఒక్కటే. అదే ‘సత్యమేవ జయతే’. ప్రశ్నించే తత్వాన్ని వారసత్వంగా మనకు అందించారు బాపూజీ.
హైదరాబాద్: చెడుపై మంచి గెలిచిన రోజు(దసరా పండుగ).. అంతర్జాతీయ అహింసా దినం(మహాత్ముడి జయంతి).. రెండూ ఈ ఏడాది ఒకేరోజు రావడం కాకతాళీయమే. అయితే ఆ పర్వదినాల పరమార్థం ఒక్కటే. అదే ‘సత్యమేవ జయతే’. ప్రశ్నించే తత్వాన్ని వారసత్వంగా మనకు అందించారు బాపూజీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం తొమ్మిది రూపాలు దాల్చింది దుర్గమ్మ. న్యాయాన్ని ధర్మబద్ధంగా సాధించేందుకు సత్యాగ్రహ మార్గాన్ని గాంధీజీ చూపించారు. అమ్మలా ప్రేమ పంచడమేకాదు అవసరమైతే అపరకాళిగానూ మారాలన్నది ఆదిశక్తి అవతారాల సందేశం.
దుర్గమ్మ సందేశం - మహాత్ముడి బోధన
లోక కంటకులైన అసురులను మట్టుపెట్టేందుకు అమ్మ తొమ్మిది రూపాలు దాల్చింది. రాక్షసులంటే కొమ్ములు, కోరలతో వికారమైన రూపంలో దర్శనమిస్తారనుకుంటే పొరపాటే. మనిషిలోని పశుప్రవృత్తి, అహంకారం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, మూర్ఖత్వం, కుసంస్కారం వంటి అవలక్షణాలే రాక్షసత్వానికి ప్రతిరూపం. రాక్షసత్వానికి పాల్పడితే శిక్షతప్పదని ఆదిశక్తి అవతారాలు హెచ్చరిస్తాయి. కామ, క్రోద, లోభ, మోహ, మదమాత్సర్యాలైన అంతర్గత శత్రువులపై ఆధిపత్యం సాధించడానికి సత్య నిష్ఠ ఒక్కటే ఏకైక మార్గమని మహాత్ముడు బోధించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
Read Latest Telangana News and National News