Minister Sridhar Babu: మూసీ ప్రక్షాళనపై తగ్గేదే లేదు
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:21 AM
భవిష్యత్ తరాల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, ఈ విషయంలో వెనకడుగు వేసిది లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. నీటి వనరుల పరిరక్షణలో..
భావితరాల కోసం చేసి తీరుతాం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్ తరాల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, ఈ విషయంలో వెనకడుగు వేసిది లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. నీటి వనరుల పరిరక్షణలో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుతామని ఆయన అన్నారు. ‘పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టువర్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ఐటీపీఐ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని పార్క్ హయాత్‌లో జరిగిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళిక చాలా ముఖ్యమని అన్నారు. ఆర్థికాభివృద్ధి పర్యావరణ పరిరక్షణతో ముడిపడి ఉంటుందని, కేవలం భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదని పేర్కొన్నారు. నగరాల ప్రణాళికలు రూపొందించేటప్పుడు వాతావరణ మార్పులు, వరదలు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాల తరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News