Kamareddy Accident: కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:25 PM
భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఉన్న 44వ జాతీయ రహదారిపై ఎలక్ట్రిక్ స్కూటీపై నలుగురు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది.
కామారెడ్డి: భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్, స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఉన్న 44వ జాతీయ రహదారిపై ఎలక్ట్రిక్ స్కూటీపై నలుగురు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో 3 సంవత్సరాల బాలుడు, మహిళ, వృద్ధుడు అక్కకక్కడే మృతి చెందగా.. ఆరు నెలల పాప పరిస్థతి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ పాపను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్ కేసులో కౌంటర్ వేయండి
Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్