Share News

Kamareddy Knife Attack: కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం.. ఐదుగురికి గాయాలు..

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:15 AM

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గ్రూపులను చేదరగొట్టారు. అనంతరం గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Kamareddy Knife Attack: కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం.. ఐదుగురికి గాయాలు..
Kamareddy

కామారెడ్డి: జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం రేపాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన శాస్త్రి దుర్గామాత దాండియా వద్ద రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న యువకులు ఒకరిపై ఒకరు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఐదుగురు యువకులకు చేతులు, పొట్ట, వీపు భాగలలో గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమచారం అందించారు.


సమాచారం అందుకన్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గ్రూపులను చెదరగొట్టారు. అనంతరం గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని రాహుల్, మణిరాజు, మణికంఠ, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో స్థానికులు.. భయాందోళనకు గురయ్యారు.


ఇవి కూడా చదవండి..

Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..

President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్

Updated Date - Oct 03 , 2025 | 11:21 AM