CM Revanth Reddy Aerial Survey of Flood Areas: మామ, అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా పాపాలు పోవు: సీఎం రేవంత్
ABN , Publish Date - Aug 28 , 2025 | 05:06 PM
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు గుండెకాయ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు. మామ, అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా పాపాలు పోవని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
కామారెడ్డి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వచ్చిన వరదలతో పలువురు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(గురువారం) ఏరియల్ సర్వే నిర్వహించారు.
సీఎం బృందం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా గోదావరి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ సీఎస్, డీజీపీ జితేంద్ర, తదితరులు ఉన్నారు.
ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చ పెడతాం..
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు గుండెకాయ అని ఉద్ఘాటించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు. మామ, అల్లుడు ఎన్ని కుట్రలు చేసిన పాపాలు పోవని విమర్శించారు. అల్లుడు స్వాతిముత్యం.. మామ ఆణిముత్యమని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నింపితే గ్రామాలే కొట్టుకుపోతాయని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం
తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్
Read Latest Telangana News and National News