Share News

Nagababu: టూరిస్టులపై దాడి హేయమైన చర్య..

ABN , Publish Date - Apr 24 , 2025 | 10:44 AM

కశ్మీర్‌లో టూరిస్టులపై దాడి హేయమైన చర్య అని శాసనమండలి సభ్యుడు కొణిదల నాగేంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఎవరిపైనో జరిగిన దాడిలా కాకుండా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జరిగిన దాడిగా భావించి ఖండించాలని ఆయన అన్నారు.

Nagababu: టూరిస్టులపై దాడి హేయమైన చర్య..

- జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు

హైదరాబాద్: కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు(MLC Nagababu) తెలిపారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పీపుల్స్‌ప్లాజా నుంచి రోటరీ చౌరస్తాలోని పీపీ నర్సింహారావు విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ తీశారు. అక్కడ బైఠాయించి పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. టూరిస్టులను టార్గెట్‌గా చేసుకొని దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గంజాయి నై.. హాషిష్‌ ఆయిల్‌ హై


ఇది ఎవరిపైనో జరిగిన దాడిలా కాకుండా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జరిగిన దాడిగా భావించి ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని, కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనపై గట్టి చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ర్యాలీలో జనసేన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్‌, నాయకులు ప్రేంసాగర్‌, దామోదర్‌రెడ్డి, రత్నం, సురేష్ రెడ్డి, మాధవరెడ్డి, కావ్య, ఆర్‌కె. సాగర్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..

చంచల్‌గూడ జైలుకు అఘోరీ

ఫినాయిల్‌, సబ్బుల పైసలు నొక్కేశారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2025 | 10:47 AM