Minister Sridhar Babu: రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల కొత్త రేషన్‌కార్డులు
ABN , Publish Date - Aug 06 , 2025 | 07:20 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, తద్వారా 24 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
- రాజేంద్రనగర్ నియోజకవర్గానికి పదివేలు
- మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, తద్వారా 24 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridharbabu) అన్నారు. పేద ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం తమదని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తు ముందుకు సాగుతున్నామన్నారు.
మంగళవారం రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాలోని మెట్రో కన్వెన్షన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధ్దిదారులకు మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే టి.ప్రకాశ్ గౌడ్, రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణరెడ్డితో కలిసి ఆయన కొత్త రేషన్‌కార్డులు అందజేశారు. ఈ నియోజకవర్గంలో సుమారు 10 వేల మందికి కొత్త రేషన్ కార్డులివ్వనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. నియోజకవర్గంలో రేషన్ కార్డులలో కొత్తగా 24,967మంది పేర్లను చేర్చామ ని తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలో మీ సేవా కార్యాలయాలు, మండల రెవెన్యు ఆఫీసులు, రేషన్ కార్డు అధికారుల కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా రేషన్ కార్డు లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రేషన్‌కార్డు ఉండటం సమాజంలో ఓ గుర్తిం పు అని ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాన ఆధారం అని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వనజాత, చేవెళ్ల ఆర్డీవో వెంకట్‌రెడ్డి, రాజేంద్రనగర్ తహసీల్దార్ బి.రాములు, ఏఎస్‌ఓ పుల్లయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Read Latest Telangana News and National News