Raghunandan Rao PM Modi: ఆపరేషన్ సింధూర్ శాలువాతో ప్రధాని నరేంద్ర మోదీకి సన్మానం
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:50 AM
ఆపరేషన్ సింధూర్ డిజైన్‌తో నేసిన శాలువాను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రధాని మోదీకి బహూకరించారు.
శాలువాను బహూకరించిన ఎంపీ రఘనందన్‌రావు
దుబ్బాక, సిరిసిల్ల, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సింధూర్ డిజైన్‌తో నేసిన శాలువాను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రధాని మోదీకి బహూకరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీని కలిసి అగ్గిపెట్టెలో అమిరిన శాలువాను బహూకరించారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా దుబ్బాకను ప్రత్యేక హబ్‌గా గుర్తించాలని ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఈ శాలువాను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ నేశారు. చేనేత మగ్గంపై రెండు గ్రాముల గోల్డ్ జరీతో రెండు మీటర్ల పొడవు, 36 ఇంచుల వెడల్పుతో శాలువాను రూపొందించారు.
10న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఈనెల 10వ తేదీన ఆ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరగనుంది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళిపై పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదులతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వ్యవహారంపై భేటీలో పరిశీలించే అవకాశమున్నట్లు తెలిసింది. మరోవైపు.. రాజగోపాల్‌రెడ్డిపై నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన నాయకులు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు