Share News

Manjira water: లీకేజీల మంజీరా.. ఇలా అయితే వేసవిలో ఇక..

ABN , Publish Date - Mar 11 , 2025 | 10:56 AM

హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి అవసరాలను తీర్చే జీవనది మంజీరా నదికి సంబంధించిన పైపులైన్ నిత్యం ఎక్కడో ఒకచోట మరమ్మతులకు గురువుతుండడంతో తాగునీటి సరఫరాలో తీవ్ర ఆటంకాలేర్పడున్నాయి. అలాగే ఈ పైప్ లైన్ మరమ్మతుల పేరిట నీటి సరఫరాను అధికారులు నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలు నీటికోసం తండ్లాడాల్సన పరిస్థితి ఏర్పడింది.

Manjira water: లీకేజీల మంజీరా.. ఇలా అయితే వేసవిలో ఇక..

- నీటి సరఫరా పునరుద్ధరించగానే దెబ్బతిన్న పైపు

- విద్యుత్‌ సమస్యతో భారీ ఒత్తిడి.. ఫలితంగా లీకేజీ

- ఇప్పటికే మూడు రోజులుగా నిలిచిన పంపింగ్‌

- ఆయా ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరాకు ఎండీ ఆదేశం

హైదరాబాద్‌ సిటీ: మంజీరా(Manjira) నది నీటిని హైదరాబాద్‌కు తరలించడం వాటర్‌బోర్డుకు కనాకష్టంగా మారింది. ప్రతీ నెలా ఏదో ఒక ప్రాంతంలో పైపులైన్‌ లీకేజీలు కావడం, వాటి మరమ్మతుల కోసం సరఫరాను బంద్‌ చేయడం పరిపాటిగా మారింది. మూడు రోజుల క్రితం బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌ వద్ద రోడ్డు పనుల కోసం మంజీర 1,500 ఎంఎం డయా పీఎస్సీ పైప్‌లైన్‌ను వేరే చోటకు మార్చేందుకు జంక్షన్‌ పనులు చేపట్టారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్‌ 1,2,3 ఫలితాలను నిలిపి వేయాలి


city7.jpg

పనులు పూర్తయ్యాక నీటి సరఫరాను పునరుద్ధరిస్తే విద్యుత్‌ సమస్య వల్ల భారీ ఒత్తిడితో నీళ్లు రావడంతో ముంబై పాత హైవేలోని మొఘల్‌ రెస్టారెంట్‌ వద్ద ఆదివారం రాత్రి భారీ లీకేజీ ఏర్పడింది. నీరంతా వృథాగా పోవడంతో అత్యవసరంగా నగరానికి మంజీర నీటి సరఫరాను నిలిపేశారు. మరమ్మతులు సోమవారం రాత్రి వరకు జరిగాయి. పనులు పూర్తవగానే సరఫరాను పునరుద్ధరిస్తామని వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు. అయితే పూర్తి స్థాయి సరఫరాకు వారం రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


city7.3.jpg

ఈ వార్తలను కూడా చదవండి:

Harish Rao: సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలి

కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు

Farmers: పంటతడి.. కంటతడి!

కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Mar 11 , 2025 | 10:56 AM