Vijay Deverakonda Car: విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు
ABN , Publish Date - Oct 06 , 2025 | 07:27 PM
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఒక్క క్షణం తేడాతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆయన కారు జోగులాంబ గద్వాల సమీపంలో ప్రమాదానికి గురైంది.
జోగులాంబ గద్వాల: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తెలుస్తోంది. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి వద్ద NH 44పై ఈ ప్రమాదం జరిగింది.
విజయ్ తన కారులో హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా.. మరో కారు వేగంగా ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ కారు విజయ్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విజయ్ దేవరకొండ కారు పాక్షికంగా దెబ్బతింది. అయినప్పటికీ, విజయ్‌కి ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం తర్వాత, విజయ్ దేవరకొండ మరో కారులో తన ప్రయాణాన్ని కొనసాగించారని తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు..
ఈ ఘటనపై విజయ్ దేవరకొండ డ్రైవర్.. ఉండవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం గురించి తెలిసిన విజయ్ దేవరకొండ అభిమానులు ఆందోళన చెందినప్పటికీ, నటుడు సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ దేవరకొండ తన హైదరాబాద్ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించారు.
విజయ్ రియాక్షన్
'నా కారు ప్రమాదంలో దెబ్బతింది. కానీ మేమంతా క్షేమంగా ఉన్నాము. జిమ్‌లో స్ట్రెంగ్త్ వర్కౌట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందకండి. ఈ వార్త మిమ్మల్ని బాధపడేలా చేయకూడదు. నా గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్' అని విజయ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి