Share News

Road Accidents: దారుణం.. కాలు విరిగి విలవిలలాడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్..

ABN , Publish Date - Feb 01 , 2025 | 08:49 AM

ఉండవల్లి(Undavalli) మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Pulluru Toll Plaza) సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. బండల లోడుతో వెళ్తున్న లారీ యూ టర్న్ తీసుకుంటుండగా.. హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొట్టింది.

Road Accidents: దారుణం.. కాలు విరిగి విలవిలలాడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్..
Road Accident

జోగులాంబ గద్వాల జిల్లా: ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాలు (Road Accidents) విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజూ పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ప్రమాదాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా బైక్, ఆటో, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. ఇవాళ (శనివారం) ఉదయం అలాంటి ఘటనే జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.


ఉండవల్లి(Undavalli) మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Pulluru Toll Plaza) సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. బండల లోడుతో వెళ్తున్న లారీ యూ టర్న్ తీసుకుంటుండగా.. హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొట్టింది. అనంతరం దాని వెనక వస్తున్న హైదరాబాద్-తిరుపతి కావేరి ట్రావెల్స్ బస్సు సీజీఆర్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కావేరి ట్రావెల్స్ బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. డ్రైవర్ కాలు విరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీజీఆర్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు సైతం స్వల్పగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister: మంత్రిగారి హెచ్చరిక.. అలాచేస్తే లైసెన్స్‌ లేకుండా చేస్తాం..

Hyderabad: ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌..

Updated Date - Feb 01 , 2025 | 08:49 AM