Share News

Minister: మంత్రిగారి హెచ్చరిక.. అలాచేస్తే లైసెన్స్‌ లేకుండా చేస్తాం..

ABN , Publish Date - Feb 01 , 2025 | 08:13 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు రోజున రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) ప్రారంభించారు.

Minister: మంత్రిగారి హెచ్చరిక.. అలాచేస్తే లైసెన్స్‌ లేకుండా చేస్తాం..

- రోడ్డు భద్రత ముగింపు మాసోత్సవాల్లో మంత్రి పొన్నం

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు రోజున రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటన ప్రకారం రాష్ట్రంలో తొలిసారి రోడ్డు భద్రత మాసాన్ని నిర్వహించామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Special trains: మహా కుంభమేళాకు ఆరు ప్రత్యేకరైళ్లు..


యువత, విద్యార్థులు, వాహనదారులు, ప్రయాణికులను భాగస్వాములను చేసి పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై విద్యార్థులకు పాఠ్యాంశాలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే లైసెన్స్‌ లేకుండా చేస్తామని మంత్రి హెచ్చరించారు. రవాణా లేకుంటే జీవితాలు లేవని, రాబోయే రోజుల్లో ట్రాఫిక్‌, రవాణా నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.


city4.2.jpg

నెలరోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు, సిబ్బందిని మంత్రి పొన్నం అభినందించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌(Anil Kumar Yadav), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్‌, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durisetty), రవాణా శాఖ కమిషనర్‌ సురేంద్ర మోహన్‌, జేటీసీలు, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, కార్పొరేటర్‌ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1

ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!

ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2025 | 08:13 AM