Share News

MLA Anirudh On Aurobindo Pharma: అరబిందో కంపెనీపై ఎమ్మెల్యే అనిరుద్ ఫైర్.. తగలబెడతా అంటూ..

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:51 PM

అరబిందో కంపెనీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరబిందో కంపెనీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించిన అనిరుద్..

MLA Anirudh On Aurobindo Pharma: అరబిందో కంపెనీపై ఎమ్మెల్యే అనిరుద్ ఫైర్.. తగలబెడతా అంటూ..
Aurobindo Pharma Pollution Issue

మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అరబిందో ఫార్మా కంపెనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలేపల్లి సెజ్ ప్రాంతంలోని అరబిందో కంపెనీ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అరబిందో కంపెనీని తగలబెడతానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్ధ పదార్థాలను రైతుల పొలాల్లోకి వదులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరబిందో కంపెనీతో కుమ్మక్కుయ్యారని ఆరోపించిన ఎమ్మెల్యే.. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అరబిందో కంపెనీ వ్యర్థాలను రైతుల పొలాల్లోకి వదలడం వల్ల పంటలు నాశనమవుతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Also Read:

ఓర్ని.. రాపిడోనూ ఇలా కూడా వాడుతారా?

అరబిందో కంపెనీపై పట్టించుకోవడం లేదు.. దానిని తగలబెడతా..

For More Latest News

Updated Date - Sep 26 , 2025 | 06:02 PM