Rapido Trash Disposal Video: ఓర్ని.. ర్యాపిడోను ఇలా కూడా వాడుతారా?
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:15 PM
ఓ యువకుడు ర్యాపిడోనూ వాడిన తీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దీన్ని ఇలా కూడా వాడుతారా? అని షాకవుతారు. ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ర్యాపిడోను ప్రయాణ సేవల కోసం ఉపయోగిస్తారు. అర్జెంట్‌గా బయటకు వెళ్లాల్సినప్పుడు, బస్ లేదా ఆటో దొరకకపోతే వెంటనే ర్యాపిడోను బుక్ చేసుకుని వెళ్లిపోతారు. అయితే, ఈ మధ్యకాలంలో కొంతమంది వింత చేష్టలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు ర్యాపిడోను వాడిన తీరు చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఈ విషయం తెలిస్తే ర్యాపిడోను ఇలా కూడా వాడుతారా? అని షాకవుతారు. ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక వ్యక్తి డెలివరీ కోసం కాకుండా ఏకంగా తన ఇంటి చెత్తను పారవేయడానికి ర్యాపిడో బైక్ ను బుక్ చేశాడు. ముందుగా సంబంధిత ర్యాపిడో వ్యక్తి పార్శిల్ సర్వీస్ కోసం బైక్‌ను బుక్ చేశాడనుకున్నాడు. కానీ, ఇంటి చెత్తను పారవేయడానికి బుక్ చేశాడని తెలిశాకా ఆ చెత్తను అక్కడే పడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓర్ని ర్యాపిడోనూ ఇలా కూడా వాడుతారా? అని కొందరు, వాడకం అంటే ఇదే బ్రో అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరూ మాత్రం మరీ ఇంత బద్దకమా? ఇలా తయారయ్యారేంట్రా.. అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరూ మాత్రం ర్యాపిడీ వారి పట్ల గౌరవంగా ఉండాలని, మరీ ఇంత దారుణంగా ట్రీట్ చేయకూడదని సూచిస్తున్నారు.
Also Read:
ఈ నాలుగు విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడకండి..
ఓజీ టికెట్ల వివాదం.. నో చెప్పేసిన హైకోర్టు
For More Latest News