Share News

Bandi Sanjay KTR: సంజయ్‌.. సారీ చెప్పండి!

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:56 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లీగల్‌ నోటీసు పంపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు తానే బాధ్యుడినంటూ సంజయ్‌ తనపై నిరాధార ఆరోపణలు చేశారని, దాంతో తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందని పేర్కొన్నారు.

Bandi Sanjay KTR: సంజయ్‌.. సారీ చెప్పండి!

  • బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్‌ నోటీసు

  • ‘ట్యాపింగ్‌’లో నాపై నిరాధార ఆరోపణలు

  • మీ వ్యాఖ్యలతో నా పరువుకు భంగం

  • వారంలో క్షమాపణ చెప్పకపోతే చర్యలు: కేటీఆర్‌

  • లీగల్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు

  • ఆట మొదలైంది: సంజయ్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లీగల్‌ నోటీసు పంపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు తానే బాధ్యుడినంటూ సంజయ్‌ తనపై నిరాధార ఆరోపణలు చేశారని, దాంతో తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏడు రోజుల్లోగా తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో తనపై, తన కుటుంబ సభ్యులపై నిరాధార ఆరోపణలు చేయకుండా ఉండాలని బండి సంజయ్‌కి సూచించారు. లేదంటే ఆయనపై చట్టపరంగా సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


అయితే లీగల్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని బండి సంజయ్‌ అన్నారు. కేటీఆర్‌ పంపిన నోటీసులపై ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. ‘‘ఆట మొదలైంది. లీగల్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు. నిజం ఒక సింహం.. దానిని విడిచిపెడితే అది తనను తాను రక్షించుకుంటుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా జీవితాలను నాశనం చేసిన నేరస్తులు బయటపడతారు. సత్యమేవ జయతే’’ అని సంజయ్‌ పోస్ట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 04:56 AM