Share News

Hyderabad: టీడీఆర్‌ స్కామ్‌కు రేవంత్‌ కుట్ర

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:43 AM

హైదరాబాద్‌లో అభివృద్ధి బదలాయింపు హక్కులు(టీడీఆర్‌), ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎ్‌ఫఎ్‌సఐ)లతో సీఎం రేవంత్‌రెడ్డి వందలు, వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

Hyderabad: టీడీఆర్‌ స్కామ్‌కు రేవంత్‌ కుట్ర

  • ఆయన చుట్టూ నలుగురు ‘రియల్‌’ బ్రోకర్లు

  • టీడీఆర్‌లపై శ్వేతపత్రం విడుదల చేయాలి

  • బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో సీఎం చచ్చేదాకా దీక్ష చేయాలి

  • కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తారు..

  • ఆయన స్థాయికి రేవంత్‌ సరిపోరు

  • మళ్లీ తెరపైకి ఫార్ములా-ఈ రేసు కేసు

  • చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అభివృద్ధి బదలాయింపు హక్కులు(టీడీఆర్‌), ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎ్‌ఫఎ్‌సఐ)లతో సీఎం రేవంత్‌రెడ్డి వందలు, వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. సోమవారం కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. రేవంత్‌ చుట్టూ ఉన్న నలుగురు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు టీడీఆర్‌ల సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి ఎఫ్‌ఎ్‌సఐ పరిమితులను విధించబోతున్నారని, దీనిపై త్వరలో ప్రకటన రాబోతోందన్నారు. రేవంత్‌ ముఠా టీడీఆర్‌లను తక్కువ రేట్లకు కొనుగోలు చేస్తుందని, ఎఫ్‌ఎస్‌ఐ పరిమితులను విధించాక టీడీఆర్‌ల డిమాండ్‌ను పెంచి అత్యధిక రేట్లకు అమ్మబోతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో భవనాలు ఎక్కువగా వస్తుండడంతో నగరాభివృద్ధికి ఇబ్బందులేర్పడుతున్నాయన్న సాకు చూపి టీడీఆర్‌లను ఎక్కువ రేట్లకు అమ్మే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికి ఇన్‌సైడర్‌ ట్రేడింగేనని.. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయదగ్గ స్కామ్‌ అని ఆరోపించారు. తన ఆరోపణల్లో నిజంలేకుంటే హైదరాబాద్‌లో టీడీఆర్‌లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఎ్‌సఐపై పరిమితులు విధించరాదని గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని, తాము దాన్నే కొనసాగించామన్నారు.


టీడీఆర్‌ల పద్ధతిలో జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ప్రజల వద్ద నుంచి 400 ఎకరాల భూమిని సేకరించిదన్నారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా, ప్రజలకు ఉపయోగపడే ఈ విధానాన్ని రేవంత్‌ తన అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటున్నాడని చెప్పారు. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే.. చనిపోయేదాకా ఆయన ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి బీజేపీకి కోవర్టుగా పని చేస్తున్నాడని, రాహుల్‌గాంధీ రాజస్థాన్‌లో మాట్లాడుతూ కాంగ్రె్‌సలో బీజేపీ కోవర్టులున్నారంటూ చేసిన వ్యాఖ్యలు రేవంత్‌ను ఉద్దేశించినవేనని ఆరోపించారు. ఢిల్లీలో రేవంత్‌ మాట నడవడంలేదని, అందుకే ఆయన చెప్పినవారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించలేదన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందాల కోసమే ఢిల్లీ వెళ్తున్నాడని ఆరోపించారు. 11 అంశాలతో ప్రధానిని కలిశానంటున్న రేవంత్‌ అసలు ఎజెండా వేరుగా ఉందని, మంత్రి శ్రీధర్‌బాబును బయటకు పంపి మోదీతో రేవంత్‌ ఏం మాట్లాడారో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి దొంగాట ఆడుతున్నారని ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగం రోజు కేసీఆర్‌ అసెంబ్లీకివస్తారని చెప్పారు. కేసీఆర్‌ స్థాయికి రేవంత్‌ ఆవ గింజంత కూడా సరిపోడన్నారు. మరోసారి ఫార్ములా-ఈ రేసు కేసును ముందుకుతెస్తారని, 16న బడ్జెట్‌ పెట్టి 17న నోటీసులు ఇచ్చి మళ్లీ తనను పిలుస్తారని చెప్పారు. గతంలో 46 కోట్లతో ఫార్ములా-ఈ రేసు నిర్వహిస్తే అవినీతి, కేసులు అంటూ మాట్లాడిన రేవంత్‌ 200 కోట్లు పెట్టి ప్రపంచ సుందరి పోటీల నిర్వహణ వల్ల ఉద్యోగాలు వస్తాయా అన్నది చెప్పాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 11 , 2025 | 04:43 AM