Krishna Basin: ఏపీ 718 టీఎంసీలు... తెలంగాణ 286 టీఎంసీలు!
ABN , Publish Date - Jun 15 , 2025 | 03:34 AM
2024-25 వాటర్ ఇయర్ (2024 జూన్ 1వ తేదీ నుంచి 2025 మే 31వ తేదీ దాకా) కృష్ణా బేసిన్‌లో ఎవరెంత మేర నీటిని వినియోగించారనే లెక్కలు తేలాయి. కృష్ణా బోర్డు పూర్తి లెక్కలను తీసినట్లు తెలిసింది.
వాటర్ ఇయర్ ముగియడంతో తేలిన కృష్ణా జలాల లెక్కలు
11 ఏళ్లలో తొలిసారి పెరిగిన తెలంగాణ వినియోగం
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): 2024-25 వాటర్ ఇయర్ (2024 జూన్ 1వ తేదీ నుంచి 2025 మే 31వ తేదీ దాకా) కృష్ణా బేసిన్‌లో ఎవరెంత మేర నీటిని వినియోగించారనే లెక్కలు తేలాయి. కృష్ణా బోర్డు పూర్తి లెక్కలను తీసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తెలుగు రాష్ట్రాలు మొత్తం 1004 టీఎంసీల నీటిని వాడుకోగా... అందులో ఏపీ వినియోగం 718 టీఎంసీలు, తెలంగాణ వాడకం 286 టీఎంసీలుగా గుర్తించారు. 11 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణ నీటి వినియోగం పెరిగింది. 2019-20లో గరిష్ఠ వినియోగం 278 టీఎంసీలు కాగా... 2022-23లో 273 టీఎంసీలే. ఇక శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఏపీ 207 టీఎంసీల నీటిని తరలించింది. హంద్రీనీవా సుజల స్రవంతి కోసం 30 టీఎంసీలు, ముచ్చుమర్రి ద్వారా 3 టీఎంసీలు, చెన్నై వాటర్ కోసం 3 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. తెలంగాణ మాత్రం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 50 టీఎంసీల నీటిని తరలించిందని గుర్తించారు.
నాగార్జునసాగర్ నుంచి సాగర్ కుడి ప్రధాన కాలువ నుంచి 192 టీఎంసీలు, ఎడమకాల్వ ద్వారా(పాలేరు దాటిన తర్వాత ఏపీ భూభాగం కోసం) 29 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఒక తెలంగాణ విషయానికి వస్తే..సాగర్ ఎడమ ప్రధాన కాలువ నుంచి 115 టీఎంసీలు, జంటనగరాల తాగునీటి అవసరాలకు 16 టీఎంసీలు, ఏఎమ్మార్పీ నుంచి 44 టీఎంసీలు కలిపి 175 టీఎంసీలు తరలించినట్లు తేల్చారు. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి ఏపీ 164 టీఎంసీలు, తుంగభద్ర నుంచి 80 టీఎంసీలు, గుంటూరు చానల్ నుంచి 2 టీఎంసీల నీటిని తరలించారని గుర్తించారు. మొత్తం కలిపి 718 టీఎంసీలు ఏపీ వాడుకోగా... తెలంగాణ 286 టీఎంసీలుగా లెక్కలు తీశారు. గత రెండేళ్లుగా కృష్ణాలో 50: 50 శాతం నిష్పత్తితో నీటిని పంచాలని తెలంగాణ పట్టుబడుతున్న విషయం విదితమే. దీనిపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు ఏమీ లేవు. కృష్ణా ట్రైబ్యునల్-2(జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్)లో నీటి కేటాయింపులపై విచారణ జరగనుంది. అయితే అప్పటిదాకా త్రిసభ్య కమిటీ(కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ కన్వీనర్‌గా, తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు)కే నీటి పంపిణీ అధికారాలు ఇచ్చారు.
కృష్ణాబోర్డు లెక్కల ప్రకారం 11 ఏళ్ల నీళ్ల గణాంకాలు
సంవత్సరం ఏపీ వినియోగం తెలంగాణ వినియోగం
(టీఎంసీల్లో) (టీఎంసీల్లో)
2014-15 529.330 227.743
2015-16 124.960 69.688
2016-17 282.512 153.386
2017-18 359.897 183.298
2018-19 504.476 207.298
2019-20 653.064 278.234
2020-21 618.935 253.234
2021-22 621.841 265.051
2022-23 637.996 273.300
2023-24 210 120
2024-25 718 286
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News