Kothi Devuni Temple: ఘనంగా ‘కోతి’ దేవుడి జాతర..
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:20 PM
ఊర్లలో శివాలయం చూసుకుంటారు.. రామాలయం చూసుంటారు.. ఆంజనేయ స్వామి ఆలయాలూ చూసుంటారు. కానీ, కోతి దేవుడి ఆలయం ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా? చూడకపోతే మీరు నిర్మల్ జిల్లాలోని ధర్మారం గ్రామానికి వెళ్లాల్సిందే.
నిర్మల్, డిసెంబర్ 20: ఊర్లలో శివాలయం చూసుకుంటారు.. రామాలయం చూసుంటారు.. ఆంజనేయ స్వామి ఆలయాలూ చూసుంటారు. కానీ, కోతి దేవుడి ఆలయం ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా? చూడకపోతే మీరు నిర్మల్ జిల్లాలోని ధర్మారం గ్రామానికి వెళ్లాల్సిందే. అవును, ఈ ఆలయమే ఇక్కడ చాలా స్పెషల్. ఆ ఊర్లో కోతి దేవుడి ఆలయం నిత్య పూజలతో అలరారుతోంది. అంతేకాదు.. ఏడాదికోసారి పెద్ద జాతర కూడా జరుగుతుంది. ఈ జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. మరి ఆ కోతి దేవుడి ఆలయం ఎప్పుడు కట్టారు.. అసలు కోతి దేవుడి స్టోరీ ఏంటి.. ఆ ఆలయం ప్రత్యేక ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
లక్ష్మణచాంద మండలంలోని పీచరా ధర్మారం గ్రామంలో కోతి దేవుని గుడి ఉంది. ప్రతి ఏటా నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా కోతి దేవుని జాతర కన్నుల పండుగ జరిగింది. గ్రామంలో ఒక కోతి మరణిస్తే దానికి సమాధి అనంతరం ఈ ఆలయం నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 1976లో గ్రామస్థులంతా వానరానికి ఆలయాన్ని నిర్మించి ఏటా పూజలు నిర్వహించడం అనవయితీగా వస్తుంది. ఈ జాతరకు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలే కాకుండా ప్రక్కనగల మహారాష్ట్ర, సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతమంతా సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాగునీరు, అన్నదాన కార్యక్రమం, స్వామి వారి దర్శనం ఏర్పాటు చేశారు. కాగా గత పది సంవత్సరాల కిందట నిర్వహించిన జడకొప్పు కార్యక్రమాన్ని నేడు పునః ప్రారంభించుకోవడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Also Read:
హీరో శివకార్తికేయన్ కారుకు ప్రమాదం..
ఎల్బీ స్టేడియం క్రిస్మస్ వేడుకలు..సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్: మంత్రి సవిత