AP Politics: ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్: మంత్రి సవిత
ABN , Publish Date - Dec 20 , 2025 | 08:50 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే ఆయన పని అని విమర్శించారు. అధికారం విషయంలో జగన్ ఇంకా భ్రమలోనే జీవిస్తున్నాడంటూ మంత్రి సెటైర్లు వేశారు.
అమరావతి, డిసెంబర్ 20: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే ఆయన పని అని విమర్శించారు. అధికారం విషయంలో జగన్ ఇంకా భ్రమలోనే జీవిస్తున్నాడంటూ మంత్రి సెటైర్లు వేశారు. శనివారం నాడు మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. పీపీపీ పద్ధతికి ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మద్ధతిచ్చారని.. గల్లీలో మాత్రం డ్రామాలాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా అయిపోయింది.. ఇప్పుడు సంతకాల డ్రామా ఆడుతున్నారంటూ దుయ్యబట్టారు.
ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలంతా చూశారని.. అందుకే ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారని మంత్రి సవిత అన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ ఖర్చు చేసింది సున్నా అని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉపయోగపడేలా పీపీపీ విధానం తీసుకువచ్చామని వివరించారామె. పీపీపీ అంటే జగన్‌కు అర్థం తెలిసి కూడా విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టర్లు అందర్ని జగన్ బెదిరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారించామన్నారు మంత్రి సవిత. సూపర్ సిక్స్‌తో పాటు ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు. రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులతో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకున్నామని వివరించారామె. గత ఐదేళ్లు పరిపాలనను జగన్ గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ బిడ్డలను వేధించారని, అక్రమ కేసులు పెట్టారని, హత్యలు చేశారని ఆరోపించారు. టిడ్కో ఇళ్లను జగన్ గాలికొదిలేశారన్నారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేసి అందజేస్తున్నామని చెప్పారు మంత్రి. వైఎస్ జగన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. పీపీపీలో మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందజేస్తామని చెప్పారు మంత్రి సవిత.
Also Read:
కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసు.. అధికారులపై ఫైర్ అయిన మందకృష్ణ మాదిగ..
డాక్టర్ నుంచి రూ.14 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
చొరబాటుదారుల ఏరివేతకే ఎస్ఐఆర్.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్