Sivakarthikeyan: హీరో శివకార్తికేయన్ కారుకు ప్రమాదం..
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:06 PM
ప్రముఖ నటుడు శివకార్తికేయన్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
చెన్నై, డిసెంబర్ 20: ప్రముఖ నటుడు శివకార్తికేయన్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో శివకార్తికేయను, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. కాగా, వీరెవరికీ గాయాలు అవలేదని, అంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.