Kishan Reddy: హైదరాబాద్ ఇమేజ్‌ను కాపాడుకోవాలి: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:44 AM
దేశంలోని అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ముందుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిసి అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా సేవలందించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించాలని సూచించారు.
హైదరాబాద్ సిటీ: దేశంలోని అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ముందుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిసి అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా సేవలందించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించాలని సూచించారు.
జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గురువారం జిల్లా అభివృద్థి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Collector Harichandana Dasari), వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డితో కలిసి శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనులు, పేదలకు అందిస్తున్న పథకాలు, అమలుతీరు తెన్నులపై కిషన్‌రెడ్డి సమీక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 36 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. గత సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్‌పై సమీక్షించారు. అలాగే దిశ కమిటీ సభ్యులగా నూతనంగా ఎంపికైన కార్పొరేటర్లు అమృత, దీపిక, భాగ్యలక్ష్మి, రవి చారి, శంకర్ యాదవ్‌ను మంత్రి అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ ముకుంద రెడ్డి, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News