Share News

Kishan Reddy: మంత్రుల తీరు వల్లే యూరియా పాట్లు

ABN , Publish Date - Aug 24 , 2025 | 02:30 AM

రాష్ట్రంలో 11 ఏళ్లుగా లేని యూరి యా కొరత కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఎందుకు వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు..

Kishan Reddy: మంత్రుల తీరు వల్లే  యూరియా పాట్లు

  • కొరత ఉందంటూ పదే పదే ప్రకటనలు

  • కంగారులో పెద్దఎత్తున రైతుల కొనుగోలు

  • కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ఈ దుస్థితి

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 11 ఏళ్లుగా లేని యూరి యా కొరత కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఎందుకు వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. యూరియా కొరత ఉందంటూ రాష్ట్ర మంత్రు లు పదే పదే చెప్పడం వల్లే రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడిగిన 50 వేల టన్నుల యూరియాను వెంటనే సమకూర్చాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాకు చెప్పానని.. రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత యూరియాను కేంద్రం సరఫరా చేస్తుందని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు హరీశ్‌రావు ఫామ్‌హౌ్‌సలో యూరియా తయారు చేశారా? అని ఎద్దేవా చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. హైదరాబాద్‌ మెట్రో అభివృద్ధికి కేంద్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మెట్రో కొత్త లైన్ల నిర్మాణాలపై ప్రస్తుతం ఉన్న కంపెనీ ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త లైన్ల నిర్మాణం ఎవరు చేపడతారు? ప్రస్తుత నష్టాలను ఎవరు భరిస్తారు? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అధికార దుర్వినియోగం జరిగాయని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తునకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. తాము ఎవరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం అంటున్నారని.. ఈ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఖరి మార్చుకుందని విమర్శించారు. అమెరికా టారి్‌ఫలు బొగ్గు గనుల శాఖపై ప్రభావం చూపవన్నారు. బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డిని తిట్టడం లేదని ఇటీవల కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించారు. హౌలా అని తిట్టాలా..? అని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను తిట్టడం, అభ్యంతరకరమైన భాష వాడటం తగదని అన్నారు. ‘రేవంత్‌రెడ్డి నన్ను సైందవుడు అని అన్నారు. బట్టలు విప్పుతా.. లాగు లో తొండలు వదులుతా అనడం ఏం భాష. మన శత్రువు పాకిస్థాన్‌. రాజకీయ పార్టీలు కాదు. మనం ప్రత్యర్థులం మాత్రమే’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం బీఆర్‌ఎస్‌ మద్దతు కోరే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం వైఎస్సార్‌సీపీ స్వచ్ఛంద నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్‌ గెలిచే వీలుంటే సుదర్శన్‌రెడ్డిని నిలబెట్టేది కాదని, ఆయన్ను బలీ కా బకరా చేసిందని విమర్శించారు. బీజేపీలో చేరాలంటే ఎవరైనా రాజీనామా చేసి రావాల్సిందేన న్నారు. అన్ని పార్టీల్లో మంచివారు, అవినీతిపరులు ఉంటారని, పార్టీల్లో చేర్చుకోవడం కొత్తేమీకాదన్నారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 02:30 AM