Share News

Kishan Reddy: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విడిపోని దోస్తులు

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:55 AM

లిక్కర్‌ స్కామ్‌ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్‌ ఢిల్లీలో ఓడిపోవడంతో.. బీఆర్‌ఎ్‌సలో కలవరం మొదలైనట్లుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విడిపోని దోస్తులు

  • ఏళ్లుగా బహిరంగంగానే చెట్టాపట్టాలు

  • వారి అనైతిక పొత్తుకు సాక్ష్యాలెన్నో

  • కేజ్రీవాల్‌ ఓటమితో బీఆర్‌ఎ్‌సలో కలవరం

  • కాంగ్రె్‌సతో జట్టుకు మళ్లీ యత్నం

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

  • ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?

  • ఒవైసీతో రేవంత్‌ గ్యాంగ్‌ కుమ్మక్కు

  • అర్బన్‌నక్సలైట్ల చేతుల్లో విద్యాశాఖ: బండి

హైదరాబాద్‌/సిటీ/బర్కత్‌పుర, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘లిక్కర్‌ స్కామ్‌ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్‌ ఢిల్లీలో ఓడిపోవడంతో.. బీఆర్‌ఎ్‌సలో కలవరం మొదలైనట్లుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అందుకే పాత దోస్తు అయిన కాంగ్రె్‌సతో మళ్లీ జతకట్టేందుకు కేటీఆర్‌ బహిరంగ ఆహ్వానం పలికారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎప్పటి నుంచో మిత్రులని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావిస్తూ కిషన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘కేసీఆర్‌ రాజకీయ జీవితం కాంగ్రె్‌సతోనే మొదలైంది. 2004లో కాంగ్రె్‌సతో కలిసి ఎన్నికల్లో గెలిచి యూపీఏ-1లో కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో బీఆర్‌ఎ్‌సను కాంగ్రె్‌సలో విలీనం చేేసందుకు కూడా సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు.. కేవలం రూ.2 లక్షలకే కాంగ్రెస్‌ కార్యాలయం కోసం విలువైన 10 ఎకరాల స్థలాన్ని అప్పగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. బీజేపీని ఓడగొట్టేందుకు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమేనన్న సంకేతాలను కేటీఆర్‌ చాలా స్పష్టంగా ఇచ్చారు. దీనికి కాంగ్రెస్‌ కూడా వంతపాడింది. కాంగ్రెస్‌ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సలో చేరి మంత్రులవుతారు. బీఆర్‌ఎస్‌ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరతారు. ఇద్దరి ఆలోచనలు ఒకటే అని చెప్పేందుకు ఇంతకన్నా ఏం కావాలి.


రాష్ట్రపతిగా.. గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. మజ్లిస్‌ పార్టీ ప్రాపకం, ముస్లిం ఓట్ల కోసం.. ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ రెండూ ఒక్కటయ్యాయి. 2023 ఆగస్టులో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం విషయంలోనూ.. బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగాయి. ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు సందర్భంలోనూ.. జాతి ప్రయోజనాలను పక్కనపెట్టి.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్‌ తీర్మానానికి బీఆర్‌ఎస్‌ బహిరంగంగా మద్దతిచ్చింది. ఈ రెండు పార్టీల అనైతిక పొత్తును చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. అలాంటిది మరోసారి బహిరంగంగా దోస్తీకి ఈ రెండు కుటుంబ పార్టీలు సిద్ధమయ్యాయి. రాజకీయాలు, అవినీతికి కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచిన ఈ పార్టీలను మరోసారి కలిపేందుకు మజ్లిస్‌ పార్టీ మధ్యవర్తిత్వం చేస్తోంది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే మూడు స్థానాలనూ తామే కైవసం చేసుకుంటామని కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. విద్యావంతులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.


రాష్ట్రంలో వచ్చేది డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌..

తెలంగాణలో రాబోయేది డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని, గ్రేటర్‌ ఎన్నికల్లో వంద సీట్లు సాధిస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడిగా లంకల దీపక్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బర్కత్‌పుర చమాన్‌ వద్ద ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. హామీల అమలులో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్‌కు పట్టినగతే రేవంత్‌ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ నుంచి బర్కత్‌పుర చమాన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల డప్పులు, నృత్యాలతో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.


స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు దూరం..?

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పోటీకి, మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎంఐఎం కలిసి పోటే చేసే యోచనలో ఉంటాయి కాబట్టి, ఈ సమయంలో పోటీ చేసి ఓడిపోవడం కంటే దూరంగా ఉండడం మంచిందని కిషన్‌రెడ్డి అన్నట్లు తెలిసింది. పోటీ చేయాలని కచ్చితమైన ఆలోచన ఉంటే మరోసారి చర్చిద్దామని కార్పొరేటర్లతో చెప్పినట్లు సమాచారం. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పై అవిశ్వాసం పెడితే దూరంగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే చోట ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు కార్పొరేటర్లను నియమిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 03:55 AM