Share News

Harish Rao: ఇప్పుడేం చేద్దాం..!!

ABN , Publish Date - May 23 , 2025 | 04:04 AM

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌కు చెందిన ఫామ్‌హౌ్‌సలో గురువారం భేటీ అయ్యారు.

Harish Rao: ఇప్పుడేం చేద్దాం..!!

  • కేసీఆర్‌తో మరోసారి హరీశ్‌రావు భేటీ

  • కాళేశ్వరం కమిషన్‌ నోటీసులపై సమాలోచన

  • ఫామ్‌హౌ్‌సలో 3 గంటల పాటు సమావేశం

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌కు చెందిన ఫామ్‌హౌ్‌సలో గురువారం భేటీ అయ్యారు. హరీశ్‌రావు మూడు గంటల పాటు కేసీఆర్‌తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావును విచారణకు పిలుస్తూ కాళేశ్వరం కమిషన్‌ ఇటీవల నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రే కేసీఆర్‌తో హరీశ్‌ సమావేశమయ్యారు. తమకు పంపిన నోటీసులపై స్పందించాలా? వద్దా? అసలు నోటీసుల్లో ఏం ప్రస్తావించారు ? దాని ఆధారంగా ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? వాటికి ఏం సమాధానం చెప్పాలి ? అనే అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, అసలు విచారణకు హాజరు కావాలా ? వద్దా ? అనే అంశంపై కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది. విచారణకు స్వయంగా హాజరుకాలేని పక్షంలో.. లిఖిత పూర్వకంగా వివరణ ఇద్దామా? న్యాయనిపుణుల సలహాతో ముందుకు వెళ్దామా? అనే విషయాలపై ఇరువురు నేతలు సమాలోచన చేసినట్లు సమాచారం. కాగా, కాళేశ్వరం కమిషన్‌ పంపిన నోటీసులు మాజీ సీఎం కేసీఆర్‌ చేతికి ఇప్పటికీ అందలేదని తెలిసింది. విచారణ కమిషన్‌ మెసెంజర్‌ ద్వారా ఫామ్‌హౌస్‌ వద్దకు పంపిన నోటీసులను అక్కడి ఎస్టేట్‌ అధికారి తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం. అయితే, రిజిస్టర్‌ పోస్ట్‌లోనూ నోటీసులు పంపినట్టు తెలిసింది.


కోల్‌కతాకు జస్టిస్‌ పీసీ ఘోష్‌

  • జూన్‌ 3న తిరిగి రాక

  • 5న కేసీఆర్‌, 6న ఈటల, 9న హరీశ్‌రావు విచారణ

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ గురువారం కోల్‌కతాకు వెళ్లిపోయారు. మళ్లీ జూన్‌ 3న ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. జూన్‌ 5నకేసీఆర్‌, 6న ఈటల రాజేందర్‌, 9న టి.హరీశ్‌రావు విచారణకు హాజరుకావాలని కమిషన్‌ నోటీసులు పంపిన విషయం విదితమే. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ తుది అంకానికి చేరింది. ముగ్గురిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసిన అనంతరం జస్టిస్‌ చంద్రఘోష్‌ నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నాయి. అయితే, ఈ దఫాలో కాళేశ్వరం కమిషన్‌ చేపట్టనున్న విచారణ అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు మాజీ మంత్రులను విచారణకు పిలవడంతో క్రాస్‌ ఎగ్జామినేషన్‌పై ఆసక్తి నెలకొంది. అయితే కేసీఆర్‌ విచారణకు హాజరు అవుతారా..? లేక కోర్టులో సవాలు చేస్తారా..?, లేఖ రాసి దూరంగా ఉంటారా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈటల, హరీశ్‌రావు తాము విచారణకు హాజరవుతామని ఇప్పటికే ప్రకటించారు. దాంతో కేసీఆర్‌ హాజరుపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:04 AM