Share News

BRS Suspends K Kavitha: కవిత సంచలన నిర్ణయం..!

ABN , Publish Date - Sep 02 , 2025 | 03:57 PM

బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ..

BRS Suspends K Kavitha: కవిత సంచలన నిర్ణయం..!
Kavitha suspension

హైదరాబాద్, సెప్టెంబర్ 1: బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని భావిస్తున్నారట. త్వరలో కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారని కూడా ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వస్తారని.. మీడియా ముఖంగానే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు.


ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తనా తీరు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. అయితే, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో కవిత.. తన ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే ఆ పదవికి కూడా రాజీనామా చేయాలని కవిత భావిస్తున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనే యోచనలో కవిత ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు.


త్వరలో కొత్త పార్టీ..?

లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి పార్టీ లైన్ దాటి అడుగులు వేస్తూ వస్తున్న కల్వకుంట్ల కవిత.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే జాగృతిని బలోపేతం చేస్తూ వచ్చిన కవిత.. అదే పేరుతో గానీ.. మరో పేరుతో గానీ కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్నారట. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభించారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ప్రకటన రావడంతో.. కొత్త పార్టీ వ్యవహారంలో కవిత మరింత స్పీడ్ పెంచనున్నట్లు తెలుస్తోంది.


Also Read:

మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకుంటే..

ఈ పండ్లు తినేటప్పుడు జాగ్రత్త..!

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 02 , 2025 | 03:57 PM