Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:27 PM
Bandi Sanjay: కరీంనగర్‌లో నాలుగు వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటల పాటు నీళ్లు సరఫరా అవుతాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పేదరికం నుంచి హర్యానా సీఎంగా, కేంద్రమంత్రిగా ఎదిగిన మనోహర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో గర్వకారణమన్నారు. కరీంనగర్‌లో డంప్ యార్డ్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారని.. డంపింగ్ యార్డు సమస్య నుంచి కరీంనగర్ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు.
కరీంనగర్, జనవరి 24: కేంద్రమంత్రి బండిసంజయ్ (Union Minister Bandi Sanjay) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో (Minister Ponnam Prabhakar) తనకు ఎలాంటి విభేధాలు లేవని అన్నారు. గంగుల కమలాకర్‌తోనే కొద్దిగా గ్యాప్ ఉందని త్వరలో అదికూడా సెట్ అయిపోతుందన్నారు. శుక్రవారం నాడు కరీంనగర్‌లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్‌ను అభివృద్ధి చేయడమే తనకు తెలుసన్నారు. జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలలకు అతీతంగా కలిసి పనిచేయాలని కోరుతున్నామన్నారు.
కరీంనగర్ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నానన్నారు. కరీంనగర్‌లో నాలుగు వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటల పాటు నీళ్లు సరఫరాల అవుతాయన్నారు. పేదరికం నుంచి హర్యానా సీఎంగా, కేంద్రమంత్రిగా ఎదిగిన మనోహర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో గర్వకారణమన్నారు. కరీంనగర్‌లో డంప్ యార్డ్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారని.. డంపింగ్ యార్డు సమస్య నుంచి కరీంనగర్ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే కొట్లాడి సాధించినట్లు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాదం స్కీంలో చేరుస్తున్నామని తెలిపారు. అలాగే కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్‌లో చేరుస్తామన్నారు. సిరిసిల్ల, వంగర ప్రాంతాల్లో నవోదయ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణకు 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, రోడ్ల కోసమే లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేశామని బండి సంజయ్ వెల్లడించారు.
సంచలన విషయాలు బయటపెట్టిన ఎల్ అండ్ టీ..
తెలంగాణకే ఎక్కువ ఇండ్లు: కేంద్రమంత్రి
‘‘ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నాం. తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తాం. కరీంనగర్ డంప్ యార్డ్‌ను ఎత్తేస్తాం. అందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రమే మంజూరు చేస్తుంది. విద్యుత్ విషయంలోనూ తెలంగాణకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ స్పష్టం చేశారు.
కాగా.. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కరీంనగర్‌కు చేరుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి శంకుస్థాపనలు చేశారుకరీంనగర్ లో 24 గంటల తాగునీరు, మల్టీ పర్పస్ పార్క్‌ను కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, బండి సంజయ్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం హౌజింగ్ బోర్డు కాలనీలో జరిగే బహిరంగ సభలో కేంద్రమంత్రి పాల్గొని ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి..
వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు..ఇందులో నిజమెంత..
Dil Raju IT Raids: దిల్‌రాజు ఇంట్లో ముగిసిన సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి
Read Latest Telangana News And Telugu News