Bandi Sanjay: దొంగ చేతికి తాళాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:33 PM
కేసీఆర్ బిడ్డ రాజీనామా చేస్తే ఏమవుతుందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. కవితను సస్పెండ్ చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? అంటూ అభిప్రాయపడ్డారు.
కరీంనగర్, సెప్టెంబర్ 03: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ వేయాలని తొలుత డిమాండ్ చేసింది తామేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే తమ డిమాండ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల కాలయాపన చేశారని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ ఎలా చేస్తుందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. కమిషన్ రిపోర్ట్ బీఆర్ఎస్ చేతిలో పెట్టి.. సీబీఐతో విచారణా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ బీఆర్ఎస్‌కు ఇచ్చి.. దొంగ చేతికి సీఎం రేవంత్ రెడ్డి తాళాలు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిడ్డ కవిత చెప్పిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తు చేశారు.
కేసీఆర్ బిడ్డ రాజీనామా చేస్తే ఏమవుతుందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. కవితను సస్పెండ్ చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? అంటూ అభిప్రాయపడ్డారు. పార్టీ అంతర్గత వ్యవహారాన్ని కావాలనే బయటకు తెచ్చారని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతిని డైవర్ట్ చేయడానికే.. తెరపైకి కవిత అంశం తీసుకు వచ్చారని కేంద్ర మంత్రి సంజయ్ విశ్లేషించారు. కవిత ఎపిసోడ్‌తో తెలంగాణకు ఏమైనా లాభం ఉందా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
For More TG News And Telugu News