Gold Missing Case: నిజంగా దేవుడివి సామీ నువ్వు.. 13 తులాల బంగారాన్ని..
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:24 PM
రోడ్డుపై పది రూపాయలు దొరికితేనే అటూ ఇటూ చూసి చటుక్కున చేబులో పెట్టుకునే కాలం ఇది. అవును మరి.. డబ్బులు దొరికినా.. బంగారం దొరికినా జేబులో వేసుకునే వారే ఎక్కువగా ఉన్నారు నేటి కాలంలో. ఇలాంటి కాలంలోనూ కొందరు వ్యక్తులు తమ నిజాయితీని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి గురించి తెలిస్తే మీరే స్వయంగా నువ్ దేవుడివి సామీ అని కీర్తిస్తారు.
కరీంనగర్, సెప్టెంబర్ 24: రోడ్డుపై పది రూపాయలు దొరికితేనే అటూ ఇటూ చూసి చటుక్కున చేబులో పెట్టుకునే కాలం ఇది. అవును మరి.. డబ్బులు దొరికినా.. బంగారం దొరికినా జేబులో వేసుకునే వారే ఎక్కువగా ఉన్నారు నేటి కాలంలో. ఇలాంటి కాలంలోనూ కొందరు వ్యక్తులు తమ నిజాయితీని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి గురించి తెలిస్తే మీరే స్వయంగా నువ్ దేవుడివి సామీ అని కీర్తిస్తారు.
అసలే బంగారం ధర భగభగమంటోంది. వేల ధర దాటి లక్షకి పైగా చేరింది. పెరుగుతున్న ఈ ధరలు చూసి బంగారం కొనాలంటేనే సామాన్యులు హడలిపోతున్నారు. ఇలాంటి సమయంలో 1 గ్రాము కాదు.. 10 గ్రాములు కాదు ఏకంగా 1300 గ్రాముల(13 తులాలు) బంగారం దొరికితే ఎవరైనా ఊరుకుంటారా.. చడీ చప్పుడు కాకుండా సంకలో పెట్టుకుని చెక్కేయరు.. కానీ, ఓ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. ఆ బంగారం వెనుక బాధితుల కష్టాన్ని గుర్తించాడు అతను. అందుకే.. పరుల సొమ్ము తనకు వొద్దని భావించి.. బాధితులకే అందజేశాడు. దారివెంట వెళ్తుండగా తనకు దొరికి 13 తులాల బంగారాన్ని తిరిగి బాధితులకే అప్పగించాడు ఆ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్‌కు చెందిన రెడ్డబోయిన రమేష్.. గత మూడు రోజుల క్రితం భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామం నుంచి తన కుటుంబ సభ్యుల వద్ద గల 13 తులాల బంగారం తీసుకుని బైక్‌పై హుజరాబాద్‌కు బయలుదేరాడు. మార్గమధ్యలో బంగారం ఉన్న బ్యాగ్ పడిపోయింది. గమ్యం చేరాక తన బ్యాగ్ కనిపించకపోవడంతో.. రమేష్ హుజురాబాద్ పోలసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు బంగారం ఉన్న బ్యాగ్.. హుజురాబాద్‌లోని ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన సమ్మయ్య, నఫిజ దంపతులకు దొరికింది. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో ఫిర్యాదురుడైన రమేష్‌ను సీఐ కరుణాకర్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి.. తాను పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి అతనికి అప్పగించారు. ఈ విషయంలో మానవతా దృక్పథ చాటుకున్న సమ్మయ్య, నఫీజలను పోలీసులు అభినందించారు. శాలువాతో సన్మానించారు. ఈ విషయంలో సమ్మయ్య దంపతులను ప్రజలు కూడా అభినందిస్తున్నారు.
Also Read:
IMD Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
Ladakh Statehood Row: రాష్ట్ర హోదా ఆందోళనలు హింసాత్మకం.. నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్
For More Telangana News and Telugu News..