Share News

Telangana: అవును లేఖ రాశా.. కవిత సంచలన కామెంట్స్..

ABN , Publish Date - May 23 , 2025 | 09:08 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేసీఆర్‌కు తాను లేఖ రాశానని చెప్పారు. రెండు వారాల క్రితమే తాను లేఖ రాశానని.. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదన్నారు కవిత.

Telangana: అవును లేఖ రాశా.. కవిత సంచలన కామెంట్స్..
Kavitha Reacts on Letter

హైదరాబాద్, మే 23: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేసీఆర్‌కు తాను లేఖ రాశానని చెప్పారు. రెండు వారాల క్రితమే తాను లేఖ రాశానని.. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదన్నారు కవిత. అమెరికా నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కవితను మీడియా ప్రతినిధులు లేఖ అంశంపై ప్రశ్నించారు. దీనికి స్పందించిన కవిత.. నిజమే ఆ లేఖ తానే రాశానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొన్ని సంచలన కామెంట్స్ చేశారామె.


కవిత ఏమన్నారంటే..

‘నేను కేసీఆర్‌‌కు లేఖ రాశాను. రెండు వారాల క్రితమే కేసీఆర్‌కు లేఖ రాశాను. నా అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియజేశాను. కేసీఆర్‌కు రాసిన లేఖ ఎలా లీక్‌ అయిందో తెలియడం లేదు. కేసీఆర్‌ దేవుడు.. కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. కేసీఆర్‌కు నేను రాసిన లేఖ బయటకు వస్తే.. పార్టీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటీ. కేసీఆరే మా నాయకుడు. కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాం. లేఖ రాయడంలో పర్సనల్‌ ఎజెండా ఏమీ లేదు. నా లేఖ లీక్‌తో కాంగ్రెస్, బీజేపీ సంబరపడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాం. పార్టీలోని కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుంది. లేఖ రాయడంలో నా పర్సనల్ ఏజెండా ఏమీ లేదు.’ అని కవిత చెప్పుకొచ్చారు.


Also Read:

దంచికొట్టిన ఇషాన్ కిషన్!

రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుంది

కుర్ర బ్యాటర్ వరల్డ్ రికార్డ్!

For More Telangana News and Telugu News..

Updated Date - May 23 , 2025 | 09:55 PM