MP Raghunandan Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటేస్తే.. మూసీలో వేసినట్లే
ABN , Publish Date - Oct 11 , 2025 | 10:14 AM
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం జెండా ఎగిరితీరుతుందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్లేనని ఆయన అభివర్ణించారు.
- బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
హైదరాబాద్: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం జెండా ఎగిరితీరుతుందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు(BJP Medak MP Raghunandan Rao) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్లేనని ఆయన అభివర్ణించారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడెల్లి అజయ్‌కుమార్ అధ్యక్షతన అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారని, ఈ అభ్యర్థికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా.. జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని,

కాంగ్రె స్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతమ్‌రావు, ఓబీ సీ మోర్చా రాష్ట్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి, నాయకులు కన్నె రమేష్ యాదవ్, శ్యాంరాజ్, నందకిషోర్‌యాదవ్, సూర్యప్రకాష్ సింగ్, బల్వీర్, నాగరాజుచారి, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News