Jagga Reddy: రాహుల్ నాయకత్వంలో.. రేవంత్ సర్కార్‌ది సామాజిక ప్రజాపాలన
ABN , Publish Date - May 05 , 2025 | 03:52 AM
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సామాజిక ప్రజాపాలన చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
ఆయన ఆదేశం మేరకు కులగణనా చేసింది
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కవితకు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా?
కాంగ్రెస్ పాలనలో ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ
ఆ స్వేచ్ఛ వల్లే కవితా మాట్లాడుతోంది
బీఆర్‌ఎ్‌సది యాక్టింగ్ పాలనైతే.. మాది రియాలిటీ పాలన: జగ్గారెడ్డి
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సామాజిక ప్రజాపాలన చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం సామాజిక తెలంగాణ, మాట్లాడే స్వేచ్ఛ, ప్రజాపాలన కోరుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఇచ్చిందన్నారు. రాహుల్‌గాంధీ ఆదేశం మేరకు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం కులగణన సర్వేను నిర్వహించిందని గుర్తు చేశారు. ‘‘కేసీఆర్ కూతురు కవిత.. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కొత్త రాగం ఎత్తుకుంది. అధికారం పోయాక సామాజిక తెలంగాణ అంటూ పెద్ద మాటలు మాట్లాడుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆమెకు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా? అధికారం పోయాక గుర్తుకు వచ్చిందా?’’ అంటూ నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. సామాజిక తెలంగాణ అంశాన్ని పట్టించుకోలేదంటూ కవిత.. చెప్పకనే చెప్పారని, ఆమె మనసులో మాటలు.. ఆమెకు తెలియకుండానే బయటికి వచ్చాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రజలు కోరుకున్న స్వేచ్ఛను వారికి ఇచ్చిందన్నారు. వారు గొంతు విప్పి మాట్లాడే స్వేచ్ఛను కల్పించిందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆ స్వేచ్ఛలోనే కవిత కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఇందిరాపార్కు వద్దనున్న ధర్నా చౌక్‌లో కూర్చుని మాట్లాడుతున్నారంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ వల్లనేనన్నారు. జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద కూడా ధర్నాలు చేసుకునే స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. కొత్త కొత్త రాగాలు ఎంచుకుని నటించడం కేసీఆర్ కుటుంబానికే సాధ్యమని విమర్శించారు. కేసీఆర్ పాలన నటించే పాలనైతే.. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజలు కోరుకున్న.. ప్రజాపాలనన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి యాక్టింగ్ పాలనైతే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రియాలిటీ పాలన అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ చెప్పినట్లుగా ప్రజలు కాంగ్రె్‌సకు పదేళ్ల పాటు పరిపాలించే అవకాశం ఇస్తారని, పార్టీ కార్యకర్తలకూ ఆ విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుతం ప్రజలకు లభిస్తున్న స్వేచ్ఛ కొనసాగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే ప్రజలు కోరుకుంటారని, బీఆర్‌ఎ్‌సను అధికారంలోకి తెచ్చుకుని మళ్లీ బందీలు కావాలని కోరుకోరన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..