Share News

Hyderabad: వేసవికి ముందే వాటర్ ట్యాంకర్లకు పెరిగిన గిరాకీ..

ABN , Publish Date - Jan 31 , 2025 | 10:36 AM

వేసవి ఇంకా రాలేదు కానీ ఉదయం వేడి... రాత్రి చలితో ప్రజలు వణుకుతున్నారు. తాగునీటికి అప్పుడే డిమాండ్‌ అధికమవుతోంది. సహజంగా ఏప్రిల్‌, మేలో నీటికి డిమాండ్‌ పెరగడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది.

Hyderabad: వేసవికి ముందే వాటర్ ట్యాంకర్లకు పెరిగిన గిరాకీ..

హైదరాబాద్: వేసవి ఇంకా రాలేదు కానీ ఉదయం వేడి... రాత్రి చలితో ప్రజలు వణుకుతున్నారు. తాగునీటికి అప్పుడే డిమాండ్‌ అధికమవుతోంది. సహజంగా ఏప్రిల్‌, మేలో నీటికి డిమాండ్‌ పెరగడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ ఏడాది చలికాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో ఏమిటన్నది జలమండలి అధికారులకు సైతం అంతుచిక్కడం లేదు. సైనిక్‌పురి డివిజన్‌ పరిధిలోని మల్కాజిగిరి, అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: సికింద్రాబాద్‌లో గంజాయి చాక్లెట్ల పట్టివేత..


- 10 సెక్షన్లు... 4 ఫిల్లింగ్‌ కేంద్రాలు

మల్కాజిగిరి(Malkajgiri), అల్వాల్‌ సర్కిల్‌ జలమండలి డివిజన్‌పరిధిలో మొత్తం 10 సెక్షన్లు ఉన్నాయి. ట్యాంకర్ల కోసం సైనిక్‌పురి, మౌలాలి, లోతుకుంట, కౌకూర్‌ 4 సెక్షన్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ట్యాంకర్ల డిమాండ్‌ కూడా పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా ఫిల్లింగ్‌ కేంద్రాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. గతేడాది 2024లో మార్చిలో డిమాండ్‌ పెరగగా.. ఈ సారి జనవరిలోనే ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది.


- గతేడాది రోజుకు 43.. ఈ ఏడాది రోజుకు 52

మల్కాజిగిరి, అల్వాల్‌ సర్కిల్‌ డివిజన్‌ పరిధిలో గతేడాది జనవరిలో రోజుకు 43 ట్యాంకర్లు బుక్‌ అయ్యాయి. ఈ ఏడాది 2025 జనవరిలో ఇప్పటి వరకు రోజుకు దాదాపు 52 ట్యాంకర్లు బుకింగ్‌ అవుతుండటం గమనర్హం. గతేడాది పోలిస్తే రోజుకు 9 ట్యాంకర్లు అదనం.. యాప్రాల్‌, కౌకూర్‌, మచ్చబొల్లారం, తుర్కపల్లి(Turkapalli), భూదేవినగర్‌, మౌలాలి, సైనిక్‌పురి, ఇందిరానగర్‌, కానాజిగూడ అత్యధికంగా డిమాండ్‌ ఉంది.


ప్రస్తుతానికి డివిజన్‌ పరిధిలో రెండు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతుండటం.. తాగునీరు సరిపడా సరఫరా కాకపోవడం.. మధ్యమధ్యలో సరఫరాలో అంతరయాం కలగుతుండటంతో ట్యాంకర్లకు డిమాండ్‌ పెరగడానికి కారణమని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. రోజురోజుకు కాలనీలతో పాటు జనాభా పెరగడం కూడా మరోకారణం. రాబోయే వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్లను సరఫరా చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని జలమండలి జీఎం సునీల్‌ పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 31 , 2025 | 10:36 AM