Share News

R. Krishnaiah: 42 శాతం రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే..

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:40 AM

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య(MP R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. మంగళవారం, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

R. Krishnaiah: 42 శాతం రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే..

- బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య(MP R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. మంగళవారం, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సీలింగ్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) ఎత్తివేసిందని, ఇప్పుడు ఏ సీలింగ్‌ లేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: శిశువు కిడ్నాప్‌ కేసు.. ఐదు గంటల్లోనే ఛేదించిన పోలీసులు


బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని సీఎం రేవంత్‌(CM Revanth) ప్రకటించడం బీసీలను మోసం చేయడమేనని ఆర్‌. కృష్ణయ్య విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని ప్రకటించారని, ఇప్పుడు తప్పించుకోవడానికి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరలేపారని సీఎంపై కృష్ణయ్య ఆరోపణలు చేశారు.

city10.2.jpg


ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి

ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 12 , 2025 | 11:40 AM