Share News

Hyderabad: శిశువు కిడ్నాప్‌ కేసు.. ఐదు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:21 AM

శిశువు కిడ్నాప్‌ కేసును పోలీసులు ఐదు గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. మరో మహిళ పరారీలో ఉంది. మంగళవారం కాచిగూడ పోలీస్‏స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండలం డీసీపీ బి. బాలస్వామి, అడిషనల్‌ డీసీపీ జోగుల నర్సయ్య వివరాలు వెల్లడించారు.

Hyderabad: శిశువు కిడ్నాప్‌ కేసు.. ఐదు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

- ఇద్దరు నిందితుల అరెస్ట్‌.. మరో మహిళ పరారీ

హైదరాబాద్: శిశువు కిడ్నాప్‌ కేసును పోలీసులు ఐదు గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. మరో మహిళ పరారీలో ఉంది. మంగళవారం కాచిగూడ పోలీస్‏స్టేషన్‌(Kacheguda Police Station)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండలం డీసీపీ బి. బాలస్వామి, అడిషనల్‌ డీసీపీ జోగుల నర్సయ్య వివరాలు వెల్లడించారు. లాల్‌దర్వాజ(Laldarwaja)లో నివసిస్తున్న సంధ్యారాణికి సంతానం లేదు. పిల్లవాడిని దత్తత తీసుకుంటానని పరిచయస్తులు కార్వాన్‌లో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి రాఘవేందర్‌(48), ఎన్‌. ఉమావతి(55)కి చెప్పింది. వీరిద్దరూ మధ్యవర్తిగా ఉండి తమకు పరిచయం ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్న గౌలిగూడకు చెందిన బోగ నర్సింగ్‌రాజ్‌(46)ను సంధ్యారాణికి గత ఏడాది జూన్‌లో పరిచయం చేశారు. పిల్లవాడిని దత్తత ఇప్పిస్తే రూ. 1.50 లక్షలు ఇస్తానని చెప్పింది. అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు ఇచ్చింది.

ఈ వార్తను కూడా చదవండి: HYDRA: చెరువుల ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం..


వనపర్తి జిల్లాకు చెందిన రవి, వరలక్ష్మి భార్యాభర్తలు. నగరానికి వచ్చి ఉప్పుగూడ(Uppuguda)లో నివసిస్తున్నారు. రవి కూలిపని చేస్తున్నాడు. అతడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వరలక్ష్మి మూడు నెలల శిశువుతో చాదర్‌ఘాట్‌ చౌరస్తాలో భిక్షాటన చేస్తోంది. వారం రోజులుగా ఆమెను గమనించిన బోగ నర్సింగ్‌రాజు ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమె బిడ్డను కిడ్నాప్‌ చేయాలని పథకం వేశాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చాదర్‌ఘాట్‌ చౌరస్తాలో ఉన్న వరలక్ష్మి వద్దకు వెళ్లాడు. రూ. 50 వేలు ఆమెకు ఇచ్చాడు. నీకు, కుమారుడికి దుస్తులు ఇప్పిస్తానని నమ్మించి కాచిగూడలో డీమార్ట్‌కు తీసుకెళ్లాడు. వరలక్ష్మి దుస్తులు చూస్తుండగా.. శిశువు గుక్కపట్టి ఏడ్చాడు.


నర్సింగ్‌ రాజు ఎత్తుకొని జోకొడుతున్నట్టు నటించి తీసుకొని పారిపోయాడు. వరలక్ష్మి చూసేసరికి బిడ్డ, నర్సింగ్‌రాజు కనిపించకపోవడంతో డీమార్ట్‌లో కొద్దిసేపు నానా యాగి చేసింది. డీమార్ట్‌ నిర్వాహకులు సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడిని ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. బాధితురాలు వెంటనే కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ చంద్రకుమార్‌ శిశువు ఆచూకీ తెలుసుకునేందుకు ఎస్‌ఐ డి.సుభాష్‌, పి.రవికుమార్ల సారథ్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. నర్సింగ్‌రాజు శిశువును తీసుకుని ఆటోలో కార్వాన్‌ వైపు వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. నర్సింగ్‌రాజు శిశువును దత్తత తీసుకొచ్చానని నమ్మించి సంధ్యారాణికి అప్పగించాడు. ఆమె అతడికి రూ. 30 వేలు ఇచ్చింది.


city9.2.jpg

సోమవారం రాత్రి 7 గంటలకు అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువును స్వాధీనం చేసుకొని నర్సింగ్‌రాజ్‌, రాఘవేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితురాలు ఎన్‌. ఉమావతి పరారీలో ఉంది. ముగ్గురిపై కిడ్నాప్‌, మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని డీసీపీ, అడిషనల్‌ డీసీపీలు తెలిపారు. శిశువు కిడ్నాప్‌ కేసును ఐదు గంటల్లోనే ఛేదించిన ఇద్దరు ఎస్‌ఐలకు డీసీపీ రివార్డులు అందజేశారు. శిశువును తల్లికి అప్పగించారు. కార్యక్రమంలో కాచిగూడ ఏసీపీ రఘు, సీఐ చంద్రకుమార్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి

ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 12 , 2025 | 11:21 AM