HYDRA: చెరువుల ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం..
ABN , Publish Date - Feb 12 , 2025 | 10:56 AM
చెరువుల ఆక్రమణలపై హైడ్రా(HYDRA) ఉక్కుపాదం మోపుతోంది. కొంపల్లి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ సరిహద్దుల్లోని తుమ్మారు చెరువులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల్లో కొందరు తమ భూమి ఉందని మట్టితో చెరువును పూడ్చారు.

- ఆక్రమణలను తొలగించిన అధికారులు
హైదరాబాద్: చెరువుల ఆక్రమణలపై హైడ్రా(HYDRA) ఉక్కుపాదం మోపుతోంది. కొంపల్లి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ సరిహద్దుల్లోని తుమ్మారు చెరువులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల్లో కొందరు తమ భూమి ఉందని మట్టితో చెరువును పూడ్చారు. అలా పూడ్చిన స్థలంలో కొన్ని షెడ్లు నిర్మించి, వాటిని కిరాయికి కూడా ఇచ్చారు. దీనిపై మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే నిర్వహించిన నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించారు.
ఈ వార్తను కూడా చదవండి: MLC: జీహెచ్‌ఎంసీ కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది..
దీనికితోడు స్థానికంగా ఉన్న కొంతమంది చెరువులో మట్టిని నింపుతున్నారని హైడ్రా అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితం చెరువులో మట్టి నింపుతున్న టిప్పర్‌ను ఆర్‌డీఎఫ్, నీటిపారుదల, హైడ్రా అధికారులు పట్టుకొని పేట్‌బషీరాబద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు మట్టిని నింపుతున్న టిప్పర్ యజమానిపై కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు తుమ్మారు చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన రేకుల షెడ్లు, ప్రహారీని పోలీసుల సహాయంతో నేలమట్టం చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, చెరువులకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
కూల్చివేతలతో సరిపెడతారా?
తుమ్మారు చెరువు 44 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, సగం మేర కబ్జాకు గురైంది. దుండిగల్, గండిమైసమ్మ(Dundigal, Gandi Maisamma) మండల పరిధిలోని దూలపల్లి గ్రామ ప్రభుత్వ సర్వే నంబరు 1, 2లో ఉంది. మరికొంత మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 388, 523, 524, 534, 535, 536, 537ల్లో అదేవిధంగా కాజాగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 29లో విస్తరించి ఉంది.
ఈ చెరువులో వెలసిన అక్రమ షెడ్లను కూల్చివేసిన హైడ్రా, ఇరిగేషన్ అధికారులు ఇకముందు కూడా కబ్జాకు గురికాకుండా ఉండేందుకు చర్యలు చేపడతారా? లేక కూల్చివేతలతోనే సరిపెడతారా? అనే సందిద్గంలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో కబ్జాకు గురవుతున్న తుమ్మారు చెరువును కాపాడి, రాబోయే తరానికి అందజేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి
ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..
Read Latest Telangana News and National News