I bomma Ravi Case: ఐబొమ్మలన్నీ అక్కడి నుంచి తీసుకున్నవే.. గుట్టు విప్పేసిన రవి..
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:35 PM
ఐబొమ్మ రవి రెండో విడత కస్టడీ ముగిసింది. ఈ క్రమంలో అతను పోలీసుల ముందు సంచలన విషయాలు వెల్లడించాడు. ఐబొమ్మకు పేరు పెట్టడానికి గల కారణాల దగ్గర నుంచి సినిమా ఫైరసీ వరకూ అనేక విషయాలను వెల్లడించాడు..
హైదరాబాద్: ఐబొమ్మ రవి రెండో విడత కస్టడీ ముగిసింది. ఈ క్రమంలో అతను పోలీసుల ముందు సంచలన విషయాలు వెల్లడించాడు. రవి మెయిల్ అకౌంట్స్ రిట్రైవ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్స్‌లో 21వేలకు పైగా సినిమాలను గుర్తించారు. పైరసీ వెబ్‌సైట్స్ నుంచి సినిమాలు రికార్డింగ్ చేసినట్టు గుర్తించారు. ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డింగ్ చేసినట్టు రవి అంగీకరించినట్లు తెలిసింది. రికార్డింగ్ చేసిన ఆడియోలు, వీడియోల క్వాలిటీ పెంచేందుకు.. కరేబియన్ దీవుల్లో ఔట్సోర్సింగ్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి రవి పోలీసులకు వివరించాడు. తాను నిర్వహించిన వెబ్సైట్లపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఐబొమ్మ పూర్తిపేరు ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించాడు. విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని.. బొమ్మను ఇంటర్నెట్లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అని పేరు పెట్టినట్లు చెప్పాడు. మరో వెబ్‌సైట్‌కు బలపం పేరు పెట్టాలని భావించినట్లు తెలిపాడు. అయితే డొమైన్లో సాంకేతిక సమస్యతో L అక్షరం తీసి బప్పంగా మార్చినట్లు వివరించాడు. తాను అప్లోడ్ చేసిన సినిమాలన్నీ టెలిగ్రామ్ నుంచి తీసుకున్నవే అని రవి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా
నేను ఇలానే మాట్లాడుతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News