Telangana: మళ్లీ నేనే ముఖ్యమంత్రిని.. చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Mar 15 , 2025 | 10:10 PM
తొలిసారి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో తమకు ఓటు వేశారని.. రెండోసారి మాత్రం ప్రేమతో ఓట్లు వేస్తారని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని సీఎం రేవంత్ అన్నారు. తన పనిని నమ్ముకుని..
హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. తొలిసారి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో తమకు ఓటు వేశారని.. రెండోసారి మాత్రం ప్రేమతో ఓట్లు వేస్తారని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని సీఎం రేవంత్ అన్నారు. తన పనిని నమ్ముకుని తాను ముందుకెళ్తున్నానని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచ్ ముఖ్యం అని సీఎం ఉద్ఘాటించారు. రాష్ట్రంలో 25 లక్షల మంది పైచీలుకు రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ చెప్పారు. ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి ఉంటుందన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం కోటిమంది మహిళలకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తామన్నారు. వారు ఇప్పుడు మాట్లాడకపోయినా.. తమకే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో తాను చెప్పిందే జరిగిందని.. భవిష్యత్‌లోనూ తాను చెప్పిందే జరుగుతుందన్నారు. జనాభా లెక్కలపై కేంద్రం బడ్జెట్ అంచనాలు అడిగింది.. 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారనే అంచనా ఉందన్నారు సీఎం. డీలిమిటేషన్‌కు కేంద్రం సమాయత్తమవుతోందన్నారు. దక్షిణాదికి నష్టం జరగకుండా తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Also Read:
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన.. విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
టీడీపీ కార్యకర్త హత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. పుంగనూరు పోలీసులకు షాక్..
For More Telangana News and Telugu News..