MLA Manik Rao: సంగారెడ్డి జిల్లాలో అధికారులు వర్సెస్ ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 08:59 AM
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి లేఖ ఇచ్చినా కలెక్టర్ ప్రావీణ్య పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే మాణిక్ రావు మండిపడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గంలో తాను సూచించిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు.
సంగారెడ్డి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తీరుపై జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు విషయంలో కలెక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా ఎమ్మెల్యే కోటా కింద 40 శాతం ఇళ్లు కేటాయించాలని ఇటీవల కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే.. ఎమ్మెల్యేల కోటాపై జీవో ఎక్కడ ఉందని తనను కలెక్టర్ ప్రశ్నించడం బాధించిందని మాణిక్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి లేఖ ఇచ్చినా కలెక్టర్ ప్రావీణ్య పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే మాణిక్ రావు మండిపడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గంలో తాను సూచించిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్‌ను నిన్న(బుధవారం) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింతా ప్రభాకర్‌లు కలిశారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల సమస్యను ఆడిషినల్ కలెక్టర్‌కు వివరించే సమయంలో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో జిల్లా అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..