Share News

Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు

ABN , Publish Date - May 19 , 2025 | 07:22 PM

Weather Report: బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు
IMD Telangana Weather Alert

హైదరాబాద్: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకూ ఎండల ప్రభావం ఉంది. ఎండలతోపాటు తీవ్రమైన వడగాడ్పులూ దారుణంగా ఉన్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.


ఇవాళ(సోమవారం) నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్‌కు వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్టీఆర్ఎఫ్‌, మున్సిపాలిటీ శాఖలు ముందస్తుగా సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించింది.


సాధారణంగా ప్రతి ఏడాది జూన్1వ తేదీన నైరుతి రుతువవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉండటంతో మే24వ తేదీకే కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ రుతుపవనాలు ఇప్పటికే విస్తరించాయని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు కేరళను మే24న తాకిన సుమారు 10 రోజుల వ్యవధిలోనే దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలోనూ రుతుపవనాలు విస్తరిస్తాయి.


తెలంగాణలో జూన్ మొదటి వారంలోపే ప్రవేశించి విసృత వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, నాలుగు రోజులపాటు కురిసే వర్షాలతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గితే ప్రజలకు కొంతమేర ఎండల నుంచి ఉపశమనం లభించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్‌ కనెక్షన్లు.!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 19 , 2025 | 08:04 PM