Share News

Hyderabad Accident: కారు బీభత్సం.. రెండేళ్ల చిన్నారి మృతి

ABN , Publish Date - Oct 21 , 2025 | 04:43 PM

నార్సింగీకి‌ చెందిన నవీన్ కుమార్ తన రెండు సంవత్సరాల కొడుకు జోయల్‌ను తీసుకుని టాపాసుల కోసం ఖాజాగూడాకు బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అల్కపూర్ కాలనీ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది.

Hyderabad Accident: కారు బీభత్సం.. రెండేళ్ల చిన్నారి మృతి
Hyderabad Accident

హైదరాబాద్, అక్టోబర్ 21: నగరంలోని నార్సింగీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అల్కాపూరీ కాలనీలో ద్విచక్రవాహనాన్ని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులు గాలిలో ఎగిరి కిందపడ్డారు. ఈ క్రమంలో చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని హుటాహుటిన తీవ్రంగా గాయపడిన తండ్రి, కొడుకులను ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి ఒడిలోనే కన్న కొడుకు కుషన్ జోయల్ ప్రాణాలు విడవడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.


నార్సింగీకి‌ చెందిన నవీన్ కుమార్ తన రెండు సంవత్సరాల కొడుకు జోయల్‌ను తీసుకుని టాపాసుల కోసం ఖాజాగూడాకు బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అల్కపూర్ కాలనీ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఆ తాకిడికి బైక్‌పై ఉన్న ఇద్దరు కింద పడిపోగా.. చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలోనే బాలుడు మృతి చెందాడు. దీంతో నవీన్ కుమార్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మితిమీరిన వేగం మరో బాలుడిని పొట్టన బెట్టుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీపావళి రోజు తమ గారాల పట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయాడంటూ తల్లి గుండెలు బాదుకుంటూ విలపించడం అక్కడి వారిని తీవ్రంగా కలిచి వేసింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారు నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

హరీష్‌కు మంత్రి అడ్లూరి ఛాలెంజ్

ఆ ధైర్యం మీకు లేదా.. పార్టీ ఫిరాయింపుదారులకు కేటీఆర్ సూటి ప్రశ్న

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 21 , 2025 | 04:58 PM