Harish Rao: సర్కార్‌కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలి: హరీశ్
ABN , Publish Date - Oct 21 , 2025 | 01:03 PM
బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని హరీశ్ రావు చెప్పారు. తమ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళమని పేర్కొన్నారు. 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్ లకే రిపోర్టులు పంపించే వాళ్ళమని చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 21: బస్తీలో ఉండే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు కేసీఆర్ బస్తీ దవాఖానలు ప్రారంభించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్‌కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానను ఆయన సందర్శించి మాట్లాడారు. 'బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దు. తమ గడప దగ్గరనే, తమ వాకిట్లోనే వైద్యం అందించాలని ఉద్దేశ్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానలను బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించడం జరిగింది.' అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే..ఒక్క హైదరాబాదులోనే 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని హరీశ్ చెప్పారు. తమ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళమని పేర్కొన్నారు. 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్ లకే రిపోర్టులు పంపించే వాళ్ళమని వివరించారు. ఆరు నెలల నుండి జీతం రావడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. బస్తీ దవాఖానలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వారు పని ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటని ఎద్దేవా చేశారు. ఒకటో తారీకు అందరికీ జీతాలు ఇస్తామని చెప్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం 60, 70 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. 40 రకాల మందులు సప్లై లేదని హరీశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 108 సర్వీస్ సకాలంలో రాకపోవడం వల్ల, వైద్యం అందకపోవడం వల్ల మనిషి ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో కేసీఆర్ కిట్టు ఇవ్వకపోవడం వల్ల 20% డెలివరీలు ప్రైవేటు ఆసుపత్రికి బదిలీ అయ్యాయని చెప్పారు. కేసీఆర్ మీద కోపంతో పథకాలను బంద్ చేస్తే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఎంతసేపు మద్యం దుకాణాలు పెంచుదామా, సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్ల సంపాదిద్దామా, అని తప్ప రేవంత్ రెడ్డికి వేరే ఆలోచన లేదన్నారు. వైన్ షాపుల టెండర్లకు రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆరోపించారు.
జనం తాగాలే ఊగాలే రేవంత్ రెడ్డి కిట్టి నిండాలే కానీ.. ఒకనాడు అయినా ప్రజా ఆరోగ్య వ్యవస్థపై రివ్యూ చేసావా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ ప్రజలు కూడా ప్రశంసించడం లేదన్నారు. తమ హాయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ.7,000 కోట్ల చెల్లింపులు చేసిందని గుర్తు చేశారు. రూ.3000 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద అప్పటికి ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పనిచేయడం లేదన్నారు.
స్పీచ్ పాయింట్స్:
➥బస్తీ దవాఖానలో డాక్టర్లకు, సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వారి జీతాలను ➥విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
➥బస్తీ దావఖానాలో 110 రకాల మందులు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
➥134 రకాల వైద్య పరీక్షలు బస్తీ దవాఖానలో పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.
➥కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని సిబ్బంది మానేశారు.
➥తక్షణమే ఖాళీలను నింపాలని డిమాండ్ చేస్తున్నాం.
➥జూబ్లీహిల్స్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు గమనించాలి.
➥జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే బస్తి దవాఖానాల్లో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేసారు అనుకుంటాడు.
➥ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలి.
➥జూబ్లీహిల్స్‌లో ఉండే మీ బంధుమిత్రులకు కాంగ్రెస్ నిర్లక్ష్యం గురించి చెప్పండి.
➥సీఎం తన కిట్టీ నిండుతోందా లేదా ఆలోచిస్తున్నారు తప్ప పేదలకు ఉపయోగపడే కేసీఆర్ కిట్ల గురించి ఆలోచన లేదు.
ఇవి కూడా చదవండి:
Mahesh Kumar Goud: జీవన్ రెడ్డి ఆరోపణలపై అధ్యయనం చేస్తాం.. సురేఖ వివాదం ముగిసింది: TPCC చీఫ్
Delhi: పోలీసు వీరులారా.. మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: రాజ్ నాథ్, బండి సంజయ్