Share News

Road Accident:ఘోర ప్రమాదం.. నలుగురు సజీవ దహనం

ABN , Publish Date - Jul 07 , 2025 | 09:46 PM

అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబం సజీవ దహనమైంది. కారులో ప్రయాణిస్తున్న దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు.

Road Accident:ఘోర ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
Road Accident in US

వాషింగ్టన్, జులై 07: హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబం అమెరికాలో సజీవ దహనమైంది. వెకేషన్ కోసం డల్లాస్‌కు వెళ్లిన కుటుంబం తిరిగి వస్తుండగా.. గ్రీన్ కౌంటీ వద్ద వారి కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దంపతులు తేజస్విని, శ్రీవెంకట్‌తోపాటు వారి ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. అట్లాంటా నుంచి డల్లాస్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీవెంకట్ వారి స్వస్థలం హైదరాబాద్‌లోని కొంపల్లి. వెకేషన్‌లో భాగంగా వీరు డల్లాస్‌‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు.


వారం రోజుల సెలవుల అనంతరం వీరు.. అట్లాంటా నుంచి తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారుతోపాటు అందులోని నాలుగు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. గ్రీన్ కౌంటీ ప్రాంతంలో ఈ కారు రాంగ్ రూట్‌లో వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కు.. ఈ కారును ఢీ కొట్టినట్లు ప్రాధమిక సమాచారం. ఈ కారు రాంగ్‌ రూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అమెరికా పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై భారత్‌లోని వారి బంధు మిత్రులకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో వారంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అక్కడికెళ్లి ఏం చేస్తావు జగన్

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కేవలం రూ.100తో భూముల రిజిస్ట్రేషన్‌..

వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

For More Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 10:12 PM