Tollywood Actor Nagarjuna: హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:43 AM
టాలీవుడ్ హీరో మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. ఢిల్లీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టును టాలీవుడ్ ప్రముఖ నటుడు, హీరో అక్కినేని నాగార్జున ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా.. తన ఫోటోతోపాటు తన పేరును వాడుకోకుండ నిషేధం విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం జస్టిస్ తేజస్ కారియా విచారించారు.
పర్సనాల్టీ రైట్స్ కోసం గతంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ తదితరులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
పార్టీ పరిశీలకులతో అగ్రనేతలు భేటీ
Read Latest Telangana News And Telugu News