TGPSC Meeting: TGPSC కీలక నిర్ణయం...
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:42 PM
గ్రూప్–1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో TGPSC ఇవాళ(బుధవారం) సమావేశం జరగిన విషయం తెలిసిందే. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని ఇప్పటికే నిర్ణయించగా.. ఇవాళ(బుధవారం) న్యాయనిపుణులు, ప్రభుత్వంతో TGPSC చర్చించింది.
హైదరాబాద్: TGPSC కీలక సమావేశం ముగిసింది. గ్రూప్–1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణులతో కమిషన్ చర్చలు జరిపింది. గ్రూప్-1 అంశంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని TGPSC భావిస్తున్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వానికి TGPSC చైర్మన్ నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే కోర్టులో TGPSC రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..