Share News

TG High Court BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

ABN , Publish Date - Sep 24 , 2025 | 04:14 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సరికాదని పిల్ దాఖలవగా... ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పత్రికల్లో కథనాల ఆధారంగా పిల్‌ ఎలా వేస్తారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

TG High Court BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
TG High Court BC Reservation

హైదరాబాద్, సెప్టెంబర్ 24: బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టి వేసింది. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తూ ప్రభుత్వం తెస్తున్న జీవోపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సరికాదని పిల్ దాఖలవగా... ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషనర్లపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో కథనాల ఆధారంగా పిల్‌ ఎలా వేస్తారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేస్తూ.. రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వుల జారీ చేసింది.


రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఆదేశాలు ఇవ్వాలని, 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే స్థానిక సంస్థల్లో ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇస్తే 50 శాతం దాటుతుందని.. సుప్రీంకోర్టు తీర్పు, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 50 శాతం మించకూడదని పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ రెండు పిటిషన్లను కొట్టివేసింది.


ఇవి కూడా చదవండి..

Ongole Earthquake: ఉలిక్కిపడ్డ ఒంగోలు.. అర్ధరాత్రి భూ ప్రకంపనలు..

అన్నింటిలో విఫలం.. కాంగ్రెస్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ ఆగ్రహం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 05:15 PM