CM Revanth Reddy: ఎస్ఎల్‌బీసీ పనులు ఆగడానికి వీల్లేదు: సీఎం
ABN , Publish Date - Sep 04 , 2025 | 08:41 PM
ఎస్‌ఎల్‌బీసీ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వాహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టిన సంస్థకు పలు సూచనలు ఆయన చేశారు. ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ కేవలం నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 04: ఎస్‌ఎల్‌బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ కేవలం నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు అందించడానికి ఎస్‌ఎల్‌బీసితో అవకాశం ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఎస్‌ఎల్‌బీసీ పనులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
ఒక్క సమావేశంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చేద్దామన్నారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ అధికారులకు సూచించారు. 2027 డిసెంబరు 9వ తేదీ లోపు.. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. ఎస్‌ఎల్‌బీసీ పనులకు గ్రీన్ ఛానల్‌లో నిధులు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపి అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకోనని సీఎం రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పారు. సొరంగం తొవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్‌ఎల్‌బీసీ పూర్తి కావాలని.. ఆ పనులు ఆగడానికి వీలు లేదని అధికారుకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
Read Latest TG News and National News