Telangana Secretariat No Fly Zone: తెలంగాణ సెక్రటేరియట్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించిన ప్రభుత్వం
ABN , Publish Date - Sep 19 , 2025 | 08:45 PM
సెక్రటేరియట్ భద్రతకు లోపం తలెత్తకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాన్ని నో డ్రోన్ జోన్ గా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయ(Secretariat) ప్రాంతాన్ని ఇకపై నో ఫ్లై జోన్ (No-Fly Zone) గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల సచివాలయం భవనంపై డ్రోన్ ఎగరవేసిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన సెక్రటేరియట్ భద్రతకు లోపం తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. సచివాలయం ప్రాంగణం చుట్టూ 'నో డ్రోన్ జోన్' అని పేర్కొంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంపై లేదా పరిసర ప్రాంతాల్లో అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు సచివాలయ భవనంపై డ్రోన్ ఎగరవేసిన ఘటన కలకలం రేపింది. దానిపై అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమై వెంటనే విచారణ ప్రారంభించారు. ఈ ఘటన పునరావృతం కాకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ "నో ఫ్లై జోన్" నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:
జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు
అర్బన్ మావోయిస్టులా మాట్లాడుతున్న రాహుల్
For More Latest News