Share News

School Holiday: తెలంగాణలో స్కూళ్లకు 6 రోజులపాటు సెలవు.. ఎందుకంటే?

ABN , Publish Date - Dec 09 , 2025 | 06:37 PM

తెలంగాణ పాఠశాల విద్యార్థులు ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఎందుకంటే ఆరు రోజులపాటు సెలవులు వచ్చాయి. సెలవు రోజుల్లో ఎంజాయ్ మెంట్ కోసం లాంగ్ టూర్ కి ప్లాన్ చేసుకుంటున్నారు.

School Holiday: తెలంగాణలో స్కూళ్లకు 6 రోజులపాటు సెలవు.. ఎందుకంటే?
School Holiday

హైదరాబాద్: సాధారణంగా స్కూల్ విద్యార్థులు ఎప్పుడు హాలిడేస్ వస్తాయా.. ఎలా ఎంజాయ్ చేయాలా అని తెగ ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ చదువులో మునిగిపోయే విద్యార్థులకు హాలిడేస్ ఎంతో రిలాక్స్ ఇస్తుంటాయి. వారాంతపు సెలవులు, పండగలు, ఇతర సెలవులతో ఒత్తిడి తగ్గి సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది. ఆ సమయంలో ఆటలు ఆడటం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కుటుంబంతో విహారయాత్రలకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.


తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల కారణంగా పాఠశాలలకు వరుస సెలవులు లభించనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు ఆరు రోజులపాటు సెలవులు రాబోతున్నాయి. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఏకంగా ఆరు రోజుల పాటు సెలవులు దొరకనున్నాయి. తొలి విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 10, 11 తేదీల్లో పాఠశాలలకు హాలిడేస్ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు కూడా జారీ చేశారు.


ఇక రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనున్నాయి. ఆ రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం కావడంతో రెండు రోజులు కలిసి వచ్చాయి. మూడో విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో పాఠశాలలకు హాలిడేస్ ప్రకటించారు. ఎందుకంటే పోలింగ్ సామగ్రిని సిద్దం చేయడం, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, కార్మికులకు నెలవారి వేతనంతో కూడిన హాలిడే 11వ తేదీన ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ, 26న బాక్సింగ్ డే, 28 ఆదివారం స్కూల్స్ కి సెలవులు రావడంతో విద్యార్థులు ఖుషీ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రెవెన్యూ సేవలు మరింత సులభతరం: సీఎం చంద్రబాబు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

Read Latest TG News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 07:22 PM