Share News

Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్.. 3 వేల డ్రోన్లతో గిన్నిస్‌ రికార్డ్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 09:44 PM

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో 3 వేల డ్రోన్లతో షో నిర్వహించారు. ఈ షో.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. అందుకు సంబంధించిన ధృవపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్.. 3 వేల డ్రోన్లతో గిన్నిస్‌ రికార్డ్‌
Telangana Rising Global Summit

హైదరాబాద్, డిసెంబర్ 09: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలను వివరించే థీమ్‌లతో డ్రోన్ షో ఏర్పాటు చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించేలా 3 వేల డ్రోన్‌లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. గతంలో అబుదాబిలో డ్రోన్ల ప్రదర్శనను మించి దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు సభ్యులు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధృవపత్రాన్ని అందజేశారు. ఈ సమ్మిట్-2025 ముగింపు వేడుకల్లో భారీగా బాణసంచా కాల్చారు. ఈ వెలుగుల్లో గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ప్రత్యేకతలు..

ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎప్పుడంటే..?

For More TG News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 10:18 PM