Share News

Telangana Vision Document 2047: తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ప్రత్యేకతలు..

ABN , Publish Date - Dec 09 , 2025 | 09:03 PM

2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పేదల్లో నిరుపేదలకు సహాయం చేయడానికే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు.

Telangana Vision Document 2047: తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ప్రత్యేకతలు..

హైదరాబాద్, డిసెంబర్ 09: తెలంగాణ మట్టిలోనే గొప్ప చైతన్యం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో సీఎం రేవంత్ ప్రసంగించారు. విజన్‌ డాక్యుమెంట్‌-2047 రూపకల్పనలో అందరి భాగస్వామ్యం ఉందన్నారు. నీతి ఆయోగ్‌, ఐఎస్‌బీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజలు భాగమయ్యారన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకే.. తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌-2047 రూపొందించామని చెప్పారు.

2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పేదల్లో నిరుపేదలకు సహాయం చేయడానికే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమాజంలో వివక్షత నిర్మూలన తమ లక్ష్యమని తెలిపారు. విద్య కోసం ఖర్చు చేసేది వ్యయం కాదని పెట్టుబడి అని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. విద్యలో నాణ్యతతోపాటు నైపుణ్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.


తెలంగాణ రైజింగ్ 2047 విజన్

కోర్... ప్యూర్... రేర్

  • 3 ట్రిలియన్ వృద్ధి లక్ష్యం.. మూడంచెల తంత్రం

  • 'తెలంగాణ రైజింగ్ 2047' దార్శనిక పత్రం. రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తుకు బాటలు వేసే దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.

  • రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నంలో భాగమే తెలంగాణ రైజింగ్​ 2047 డాక్యుమెంట్​

  • ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రోడ్​ మ్యాప్​.

  • తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల భవిత కోసం.. ప్రజల భవిష్యత్తు కోసం.. భావి తరాల కోసం.. ముందుచూపుతో 'తెలంగాణ రైజింగ్ 2047' డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది.

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్​ తయారు చేసింది.

  • నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు.. ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించింది.

  • అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలకు ప్రాధాన్యమిచ్చింది.

  • ఈ డాక్యుమెంట్​ తయారీలో నీతి ఆయోగ్ (NITI Aayog) కీలక భూమిక నిర్వహించింది. ISB (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారు.

  • వరుస సంప్రదింపులు, రోజుల తరబడి చర్చలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన విధానాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేసింది.

  • వీటన్నింటినీ విశ్లేషించుకుని.. వడపోసి.. తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ దార్శనిక పత్రంలో పొందుపరిచింది.

  • ఇందులో ఉన్న ప్రతి అధ్యాయం తెలంగాణ పురోగాభివృద్ధికి దోహదపడుతుంది.

  • 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ ప్రధాన లక్ష్యం

  • దీంతో తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.

  • రాష్టం నలుమూలల అన్ని జిల్లాల నుంచి దాదాపు 4 లక్షల మంది ఆకాంక్షలు.. అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. 65 శాతం యువత ఈ ఉజ్వల తెలంగాణ భవిష్యత్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు.


ఈ ఆర్ధిక వృద్ధికి మూడు మూల స్తంభాలు

  • ఆర్థిక వృద్ధి,

  • సమ్మిళిత అభివృద్ధి,

  • సుస్థిర అభివృద్ధి.

  • అధునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతోపాటు సుపరిపాలన ఈ ఆర్ధిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తాయి.

  • రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి CURE-PURE-RARE అనే మూడు-జోన్ల అభివృద్ధి నమూనాను ఈ డాక్యుమెంట్ కీలకంగా ప్రస్తావించింది.

  • హైదరాబాద్ సిటీతోపాటు పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య, పరస్పర ఆధారిత వృద్ధిని సాధించే సంకల్పం 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే మైలు రాయిని నిర్దేశించింది.

  • 2047 నాటికి జాతీయ GDPలో తెలంగాణ వాటా పదో వంతుకు చేరాలని లక్ష్యంగా ఎంచుకుంది.

  • పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను ప్రపంచ స్థాయి మౌలిక వసతులున్న అత్యాధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దటం.

  • అన్ని వర్గాలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టడం.


లక్ష్య సాధనకు మూడు సూత్రాలు:

1. ఆర్థిక వృద్ధి (Economic Growth): ఆవిష్కరణలు, ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం.

2. సమ్మిళిత అభివృద్ధి (Inclusive Development): యువత, మహిళలు, రైతులు, అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడటం.

3. సుస్థిర అభివృద్ధి (Sustainable Development): అన్ని రంగాలలో సుస్థిరతను పొందుపరచడం, 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం.

మూడు ఉత్ప్రేరకాలు..

1. సాంకేతికత, ఆవిష్కరణ (Technology & Innovation): పాలన, పరిశ్రమలు, సేవలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.

2. సమర్థవంతమైన ఆర్థిక వనరులు (Efficient Financing): పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి వినూత్న ఆర్థిక నమూనాలను రూపొందించడం.

3. సుపరిపాలన (Good Governance): పారదర్శక, జవాబుదారీ, పౌర-కేంద్రీకృత పాలనను అందించడం.


మూడంచెల వ్యూహం: CURE-PURE-RARE

  • తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని మూడు విభిన్న రంగాల వారీగా.. మూడు జోన్‌లుగా విభజన.

  • అభివృద్ధి ప్రామాణికంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

  • ఈ విధానం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి పునాదులు వేస్తుంది.

    CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ): 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ప్రాంతంలో సేవల విస్తరణకు ప్రాధాన్యం. దీంతో నెట్-జీరో సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్, ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది.

    PURE (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్ (ORR), 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మధ్య ఉన్న జోన్ తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పాటు.

    RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ): ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) దాటి రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి.


పది కీలక వ్యూహాలు

ఈ దార్శనికతను సాధించడానికి 10 కీలక వ్యూహాలను డాక్యుమెంట్ ప్రస్తావించింది.

1. 3-జోన్ల రాష్ట్రం: సమతుల్య అభివృద్ధికి CURE-PURE-RARE నమూనా.

2. విచక్షణ నుంచి విధానానికి: పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత, విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం.

3. గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు: భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజినల్ రింగ్ రోడ్, రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి ప్రాజెక్టులు.

4. సమర్థ పాలన: డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్, SPEED వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం.

5. నాలెడ్జ్ హబ్: ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం.

6. సుస్థిర సంక్షేమం: మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అందరికీ సమాన అవకాశాలు.

7. అభివృద్ధి నిధులు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం.

8. పర్యావరణం, సుస్థిరత: వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం.

9. సంస్కృతి: రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం.. ప్రోత్సహించడం.

10. ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చేత: పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.


ఈ విజన్ డాక్యుమెంట్‌లో ప్రత్యేకతలు..

  • 83 పేజీలతో విజన్‌ డాక్యుమెంట్‌-2047 రూపకల్పన

  • తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించారు.

  • 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యం

  • తెలంగాణ మీన్స్‌ బిజినెస్‌ పేరుతో విజన్‌ డాక్యుమెంట్‌

  • యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యం

  • 10 కీలక వ్యూహాలతో విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన

  • క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ జోన్లుగా తెలంగాణను విభజించారు.


ఈ తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌లో కీలక అంశాలు

  • డాక్యుమెంట్‌లో ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌కు ప్రాధాన్యం

  • పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత

  • గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం

  • ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్‌, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, ట్రిపుల్ ఆర్, రింగు రైలు, బుల్లెట్‌ రైలు

  • ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, ప్రత్యేక నిధి ఏర్పాటు

  • వాతావరణ మార్పుల వల్ల నష్టాలను తగ్గించడం

  • పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యంపై ప్రత్యేక దృష్టి


తెలంగాణ విజన్ డాక్యుమెంట్..

1. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం.

2. మూడు ప్రధాన స్తంభాలు: ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి.

3. మూడు ఉత్ప్రేరకాలు: సాంకేతికత – ఆవిష్కరణ, సమర్థవంతమైన ఫైనాన్స్, సుపరిపాలన.

4. రాష్ట్రాన్ని CURE – PURE – RARE మూడు ఆర్థిక జోన్‌లుగా విభజన.

5. CURE జోన్‌ను నెట్-జీరో సిటీగా, గ్లోబల్ ఇన్నొవేషన్ హబ్‌గా అభివృద్ధి.

6. PURE జోన్‌ను తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి.

7. RARE జోన్‌ను వ్యవసాయ – హరిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం.

8. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక మైలురాయి సాధించడం.

9. 2047 నాటికి జాతీయ జీడీపీలో 10% వాటా లక్ష్యం.

10. 4 లక్షల మంది ప్రజల అభిప్రాయాలతో రూపొందించిన దార్శనిక పత్రం.


11. నీతి ఆయోగ్, ఐఎస్‌బీతోపాటు నిపుణుల సలహాలతో రూపొందించిన వ్యూహాలు.

12. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ రీజువెనేషన్ వంటి గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు.

13. రీజినల్ రింగ్ రోడ్, రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల అభివృద్ధి.

14. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత, సేవలు వేగవంతం.

15. ప్రపంచ స్థాయి విద్య – పరిశోధన కేంద్రాలతో తెలంగాణను నాలెడ్జ్ హబ్‌గా నిర్మించడం.

16. మహిళలు, యువత, రైతులకు సమాన అవకాశాలతో సుస్థిర సంక్షేమం.

17. భారీ మౌలిక వసతుల కోసం ప్రత్యేక పెట్టుబడి నిధుల ఏర్పాటు.

18. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రాధాన్యం.

19. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ మరియు పర్యాటక అభివృద్ధి.

20. పాలనలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో 'ప్రజల కోసం–ప్రజల చేత' అభివృద్ధి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ప్రత్యేకతలు..

ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎప్పుడంటే..?

For More TG News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 10:18 PM